Begin typing your search above and press return to search.

మణి కల గతంలోనే తీరి ఉంటే.. పీఎస్ 1లో ఆ కాంబినేషన్లు ఉండేవట

By:  Tupaki Desk   |   9 Oct 2022 4:19 AM GMT
మణి కల గతంలోనే తీరి ఉంటే.. పీఎస్ 1లో ఆ  కాంబినేషన్లు ఉండేవట
X
దేశంలోని అత్యుద్భత దర్శకుల జాబితా తయారు చేస్తే.. అందులో ఉండే టాప్ పేర్లలో మణిరత్నం ఒకటి. ఇండియన్ సినిమాను కమర్షియల్ గా మరో ఎత్తుకు తీసుకెళ్లిన ఘనత ఆయనదే. ఒక కథను ఆయన చెప్పే తీరు కాలానికి అనుగుణంగా మారుతూ ఉండటమే కాదు.. ఎప్పటికప్పుడు అప్డేటెడ్ గా ఉండటం.. ఒకదానితో మరొకటి సంబంధం లేని సినిమాలు.. స్క్రిప్టులు తీయటం ఆయనకు మాత్రమే సాధ్యం.

సబ్జెక్టు ఏదైనా సరే.. దాని లోతుల్ని టచ్ చేసే టాలెంట్ ఆయన సొంతం. తాజాగా ఆయన తన డ్రీం ప్రాజెక్టు పొన్నియన్ సెల్వం 1ను ప్రేక్షకులకు అందించారు. దాదాపు నలభై ఏళ్లుగా ఆయన అనుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఈ సినిమాలో స్టార్ క్యాస్ట్ చూస్తే.. మణిరత్నంకు మాత్రమే సాధ్యమనిపించే కాంబినేషన్లు ఎన్నో ఉన్నాయి. అయితే.. ఈ సినిమాను ఆయన పలుమార్లు పట్టాలు ఎక్కించే ప్రయత్నం చేసినా.. దాని బడ్జెట్ లెక్కలతో నిర్మాతలు ఎవరూ సాహసించలేదు.

పాన్ ఇండియా కాన్సెప్టు రావటం.. సినిమా బడ్జెట్ పెద్ద విషయం కాదని.. అందరిని అలరించే అంశాలు ఉంటే.. వేలాది కోట్ల రూపాయిల కలెక్షన్లు ఒక ప్రాంతీయ చిత్రం కొల్లగొట్టొచ్చన్న విషయాన్ని నిరూపించింది బాహుబలి. దాని ఫలితాన్ని చేసిన తర్వాత మణి కల అయిన పొన్నియిన్ సెల్వం పట్టాలకెక్కింది. నిజానికి ఇప్పుడీ సినిమాలో విక్రం.. కార్తీ.. జయం రవి.. ఐష్.. త్రిష లాంటి ప్రముఖ నటీనటులు ఉండటం తెలిసిందే.

ఈ సినిమాను తెరకెక్కించే ప్రయత్నాలు 1958 నుంచి మొదలైంది. కల్కి రాసిన నవలను సినిమాగా తీయాలని మణిరత్నం 1980లో ఒకసారి.. 2000లో మరోసారి.. 2010లో ఇంకో సారి అనుకున్నా.. వాస్తవ రూపం దాల్చలేదు. ఇటీవల కాలంలో ఈ సినిమా బడ్జెట్ ను భరించేందుకు లైకా సంస్థ ముందుకు రావటంతో ప్రాజెక్టు పట్టాల మీదకు ఎక్కింది. మొదట అనుకున్న దాని ప్రకారం.. కార్తి పాత్రను రజనీకాంత్.. జయం రవి చేసిన పాత్రను కమల్ హాసన్.. విక్రమ్ పాత్రను విజయకాంత్ తో చేయించాలని మణి అనుకున్నారట. అంతేకాదు ఐష్ స్థానంలో ఎవర్ గ్రీన్ హీరోయిన్ రేఖను.. త్రిష క్యారెక్టర్ ను శ్రీదేవితో అనుకున్నా.. అప్పట్లో సాధ్యం కాలేదు. ఒకవేళ.. అప్పట్లోనే ఆచరణలోకి వచ్చి ఉంటే.. చాలా రేర్ కాంబినేషన్ ను చూసే అవకాశం లభించేదేమో కదూ?