Begin typing your search above and press return to search.
మజిలీ పుణ్యమాని మణిరత్నం గుర్తొచ్చాడు
By: Tupaki Desk | 10 April 2019 5:34 AM GMTమజిలీ విడుదలకు ముందు ట్రైలర్ వచ్చినప్పుడే ఇది ఎప్పుడో ముప్పై ఏళ్ళ క్రితం వచ్చిన మణిరత్నం మౌనరాగం ఛాయల్లో ఉందన్న సంగతి తుపాకీ ప్రత్యేకంగా ఉటంకించింది. ఇప్పుడు అదే నిజమై సోషల్ మీడియాలో సైతం చర్చకు దారి తీస్తోంది. ఫ్లాష్ బ్యాక్ లో ఒకరిని ప్రేమించి వర్తమానంలో ఇంకొకరిని ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడం అనే పాయింట్ మీద వచ్చిన సినిమాల్లో మౌనరాగం ఎవర్ గ్రీన్ క్లాసిక్. ఇప్పటికీ మ్యూజిక్ లవర్స్ కు ఇందులో పాటలు హాట్ ఫేవరేట్.
కాకపోతే మజిలిలో జరిగిన మార్పు ఏంటంటే హీరో హీరొయిన్ల పాత్రలను రివర్స్ చేయడం. మౌనరాగంలో రేవతి బలవంతంగా మోహన్ ని పెళ్లి చేసుకుంటుంది. పూర్వపు కథలో ప్రేమికుడు కార్తీక్ చనిపోయి ఉంటాడు. కట్ చేస్తే ఇక్కడ చైతు నాన్న కోసం సమంతాను చేసుకుంటాడు. మార్పెంటంటే ఎక్స్ లవర్ అన్షు చనిపోయిందనే విషయం తనకు తెలిసి ఉండదు. బోనస్ గా చైల్డ్ ట్రాక్ ఒకటి ఇందులో కలిపారు
ఇప్పుడీ పోలికను గుర్తు చేస్తూ నెటిజెన్లు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నిజమే కదా అంటూ ఓసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తున్నారు. గమనించాల్సిన అంశం మరొకటి ఉంది. మౌనరాగం మజిలి రెండు క్లైమాక్సులు రైల్వే స్టేషన్ లోనే ముగుస్తాయి. శివ నిర్వాణ స్ఫూర్తి చెందకుండా రాశాడు అనుకోవడానికి ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వలేనంతగా ఇక్కడ దొరికిపోయాడు.
ఇవన్ని ఎలా ఉన్న ప్రేక్షకుల తీర్పు ముఖ్యం కాబట్టి ఆ విషయంలో శివ సక్సెస్ అయ్యి నిన్ను కోరి తర్వాత మరో సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. అయినా ఎక్కడో కొరియన్ సినిమానో ఫ్రెంచ్ మూవీనో స్ఫూర్తిగా తీసుకుంటే అనాలి కాని మన దర్శకుడి పాత క్లాసిక్ లో ఓ పాయింట్ ని తీసుకుంటే తప్పేంటి అనే వారు కూడా లేకపోలేదు.