Begin typing your search above and press return to search.

శింబుకు డబుల్ షాక్?

By:  Tupaki Desk   |   2 Dec 2017 1:30 PM GMT
శింబుకు డబుల్ షాక్?
X
తమిళ కథానాయకుడు శింబుకు వివాదాలు కొత్తేమీ కాదు. ఐతే శింబు ఎదుర్కొంటున్న కొత్త వివాదం మాత్రం అతడిని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేలా ఉంది. ఇన్నాళ్లు శింబు ఏ వివాదంలో చిక్కుకున్నా అది అతడికి వ్యక్తిగతంగా మాత్రమే నష్టం చేకూర్చింది. కానీ ప్రస్తుత వివాదం శింబు సినిమా కెరీర్ మొత్తాన్ని దెబ్బ తీసేలా ఉంది. తాను శింబును హీరోగా పెట్టి తీసిన ‘ఏఏఏ’ సినిమా డిజాస్టర్ కావడానికి అతనే కారణమని.. అతడి వల్ల తాను 20 కోట్లు నష్టపోయానని.. అతడి నుంచి పరిహారం ఇప్పించాలని.. తనపై నిషేధం కూడా విధించాలని నిర్మాత మైకేల్ రాయప్పన్ ప్రెస్ మీట్ పెట్టి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.

మైకేల్ ఆరోపణలు చేసిన సమయంలో ‘ఏఏఏ’ దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్ కూడా ఉండటం.. అతను కూడా ఈ ఆరోపణలు నిజమే అనడంతో శింబు చుట్టూ ఉచ్చు బిగిసేట్లు కనిపిస్తోంది. తమిళ సినీ పరిశ్రమ శింబుకు రెడ్ కార్డు ఇవ్వడం ద్వారా అతడిని సినిమాల నుంచి సస్పెండ్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇండస్ట్రీ అతడిపై అధికారికంగా నిషేధం విధించకపోయినా.. ప్రస్తుత పరిస్థితుల్లో అతడితో ఎవరూ సినిమాలు చేసే పరిస్థితి కనిపించడం లేదు. శింబు చుట్టూ వివాదం ముసురుకోవడంతో అతడిని తన కొత్త సినిమాలో ఓ పాత్రకు తీసుకున్న మణిరత్నం సైతం పునరాలోచనలో పడ్డాడట. ఇంకొన్ని రోజుల్లోనే షూటింగ్ మొదలుపెట్టాల్సి ఉన్న నేపథ్యంలో శింబుతో పెట్టుకుంటే ఇబ్బందని భావించి.. అతడి స్థానంలో మరో నటుడిని తీసుకోవడానికి మణిరత్నం రెడీ అయినట్లు సమాచారం. ఇదే నిజమైతే శింబుకు ఒకేసారి డబుల్ షాక్ తగిలినట్లే.