Begin typing your search above and press return to search.
ఫోటో స్టొరీ: జాన్వి ఖుషి..మై ఫేవరెట్స్!
By: Tupaki Desk | 21 Jan 2019 11:59 AM GMTబాలీవుడ్ సినిమాలను.. హిందీ ఫిలిం న్యూస్ ను ఫాలో అయ్యేవారికి ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా పేరు తెలిసే ఉంటుంది. బాలీవుడ్ లో చాలామంది స్టార్లకు కాస్ట్యూమ్ డిజైన్ చేసేది ఆయనే. దివంగత శ్రీదేవితో ఆమె కుటుంబంతో ఆయనకు ఎంతో సాన్నిహిత్యం ఉంది. ఏ కార్యక్రమానికైనా శ్రీదేవి మనిష్ డిజైన్ చేసిన దుస్తుల్లోనే వచ్చేది. ఇప్పుడు శ్రీదేవి కుమార్తె జాన్వి కాస్ట్యూమ్స్ కూడా దాదాపు ఆయనే డిజైన్ చేస్తున్నాడు.
ఇదిలా ఉంటే తాజాగా మనీష్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా లాస్ట్ నైట్ పార్టీ ఫోటోలను పోస్ట్ చేశాడు. కరణ్ జోహార్.. ఫరా ఖాన్.. కరిష్మా కపూర్..మలైకా అరోరా.. పరిణీతి చోప్రా..ఇలా చాలామంది ఈ సండే పార్టీకి హాజరయ్యారు. కానీ అందులో శ్రీదేవి కుమార్తెలు జాన్వి.. ఖుషిలతో దిగిన ఫోటోకు మాత్రం "నా ఫేవరెట్లతో @జాన్వి కపూర్ @ఖుషి కపూర్" అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ ఫోటోలో ఇద్దరూ అక్కా చెల్లెళ్ళు మనీష్ ను మల్లె తీగల్లా అల్లుకుని మరీ హగ్గులిచ్చారు.
మీరేమీ అదోరకం లుక్కుతో చూడాల్సిన పని లేదు. ఎందుకంటే.. అక్కడకు వచ్చిన సెలబ్రిటీలందరూ దాదాపుగా అలానే మనీష్ కు హగ్గులిచ్చారు. పరిణీతి అయితే ఆయనకు కిస్సు కూడా ఇచ్చింది. మీరు ఆ కిస్సును అర్బన్.. అల్ట్రా మోడరన్ భాషలో 'పెక్'.. అంటే ఏం చేస్తాం. సరేలెమ్మని సర్దుకుంటాం!