Begin typing your search above and press return to search.
ఆ డిజైనర్ కి ఏం క్రేజ్ రా బాబోయ్...!
By: Tupaki Desk | 7 Dec 2015 9:30 AM GMTమనీష్ మల్హోత్రా.... ఆ పేరు వింటే చాలు. బాలీవుడ్ కథానాయికలు మెలికలు తిరిగిపోతుంటారు. ఓ హి ఈజ్ మై ఫేవరేట్... అంటూ గారాలు పోతుంటారు. అలాగని అతనేమీ హీరో కాదు, పేరుమోసిన దర్శకుడూ కాదు. ఓ ఫ్యాషన్ డిజైనర్. బాలీవుడ్ లో అతనికి మామూలు క్రేజ్ లేదు. సీనియర్ తార శ్రీదేవి మొదలుకొని పాలబుగ్గల అలియా వరకు అందరూ మనీష్ నామమే జపిస్తుంటారు. తెరపైన కానీ, వేడుకల్లో కానీ సమ్‌థింగ్ స్పెషల్ అన్నట్టుగా కనిపించాలంటే అందరికీ గుర్తొచ్చే పేరు మనీష్. ఆయన డిజైన్ చేస్తే తమ అందం రెట్టింపవుతుంటుందని కథానాయికలు భావిస్తుంటారు. కంగనా రనౌత్ అయితే హీరోల్ని కూడా లెక్కచేయదు కానీ మనీష్ అంటే మాత్రం ఎంతో గౌరవిస్తుంటుంది. సినిమా తారలే కాదు.. డబ్బున్న పెద్దోళ్లంతా కూడా మనీష్‌కి అభిమానులే.
ఇటీవల మనీష్ యాభయ్యో పుట్టినరోజును పురస్కరించుకొని ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ పెద్ద పార్టీ ఇచ్చింది. అంబానీలే మనీష్ కి ఫ్యాన్స్ అంటే ఆయనకున్న క్రేజేంటో అర్థం చేసుకోవచ్చు. అంబానీలు ఇచ్చిన ఆ పార్టీకి కరీనా మొదలుకొని బీ టౌన్ కథానాయికలంతా హాజరయ్యారు. ఆకాశం నుంచి దిగిపడిన తారల్లాగా వాళ్లంతా మనీష్ ని చుట్టుముట్టి ఫొటోకి పోజిస్తే... ఆయన మాత్రం తారల మధ్య నిండు చంద్రుడిలా కనిపించాడు.