Begin typing your search above and press return to search.

ఆమెతో మేనల్లుడికి డేట్ సెట్ చేస్తున్నాడట

By:  Tupaki Desk   |   8 Feb 2018 5:30 PM GMT
ఆమెతో మేనల్లుడికి డేట్ సెట్ చేస్తున్నాడట
X
సోనాక్షి సిన్హాకు ఇంకా పెళ్లి కాలేదు. ఆమెకు పెళ్లికాలం వ‌చ్చిన‌ట్టే క‌నిపిస్తోంది. అందుకే ఆమె శ్రేయోభిలాషి మ‌నీష్ మ‌ల్హోత్రా సోనాక్షికి పెళ్లి సంబంధాలు వెతికే ప‌నిలో ప‌డ్డారు. ఆమెకు త‌న ఓ అబ్బాయిని సెట్ చేస్తున్నారు.

ప్ర‌ముఖ ఫ్యాష‌న్ డిజైన‌ర్ మ‌నీష్ మ‌ల్హోత్రా మేన‌ల్లుడు పునీత్ మ‌ల్హోత్రా. అత‌ను సోన‌మ్ క‌పూర్ హీరోయిన్ ఐ హేట్ ల‌వ్ స్టోరీస్ సినిమా కూడా తీశాడు. అంత‌కుముందు క‌ర‌ణ్ జోహార్ ద‌గ్గ‌ర అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌నిచేశాడు. క‌భీ ఖుషీ క‌భీ ఘ‌మ్‌ - క‌ల్ హో నా హో - ప‌హేలీ - దోస్తానా అనే సినిమాల‌కు కూడా ప‌నిచేశాడు. ఆయ‌న ప‌నిచేసిన చివ‌రి సినిమా గోరీ తేరే ప్యార్ మైన్. ప్ర‌స్తుతం ఖాళీగానే ఉంటున్నాడు. కాగా అత‌నికి, సోనాక్షికి జోడీ కుద‌ర్చాల‌ని భావిస్తున్నాడు మ‌నీష్ మల్హోత్రా. తెలిసిన తాజా స‌మాచారం ప్ర‌కారం... వారిద్ద‌రినీ డేటింగ్ చేసే విధంగా ప్రోత్స‌హిస్తున్నాడు. మొద‌టగా వారిద్ద‌రినీ ఏకాంతంగా మాట్లాడుకునే అవ‌కాశం క‌ల్పించడానికి ప్ర‌య‌త్నిస్తున్నాడ‌ట‌.

మ‌నీష్ మ‌ల్హోత్రాకు ఎందుకింత ఆస‌క్తి అంటే... పునీత్ స్వ‌యానా మేన‌ల్లుడు. అత‌నికి పెళ్లి చేసే బాధ్య‌త ఇత‌నిపై ఉంది. ఇక సోనాక్షి మంచి ఫ్రెండ్‌. ఆమె అంటే మ‌నీష్ కు మంచి అభిప్రాయం. వీరిద్ద‌రికీ జ‌త కుదిరితే మంచి జంట అవుతుంద‌ని మ‌నీష్ భావిస్తున్నాడు. అందుకే పాపం చాలా క‌ష్ట‌ప‌డుతున్నాడు.