Begin typing your search above and press return to search.

పెళ్లైన ఆర్నెల్లకే లొల్లి మొదలైంది.. విడాకులపై మనీషా

By:  Tupaki Desk   |   5 April 2023 9:42 AM GMT
పెళ్లైన ఆర్నెల్లకే లొల్లి మొదలైంది.. విడాకులపై మనీషా
X
అందమంటే ఆమెలా ఉండాలంటూ కోట్లాది మంది కుర్రకారుకు నిద్ర లేకుండా చేసిన అందాల భరిణె మనీషా కొయిరాలా. ఆమె వెండితెరకు పరిచయమైన వేళ.. ఆమె సినిమాల్ని చూస్తే.. వెర్రెక్కిపోయిన అభిమానులు ఎందరో. అలాంటి ఆమెకు పెళ్లైన కొంతకాలానికే భర్త నుంచి విడిపోవటం షాకింగ్ గా మారింది.

అనంతరంఆరోగ్య సమస్యలతో పాటు.. కుంగుబాటుకు గురైన ఆమె సినిమాలకు దూరంగా ఉంది. కొంతకాలంగా సినిమాలకు రీఎంట్రీ ఇచ్చిన ఆమె.. ఇప్పుడు పలు ప్రాజెక్టులకు ఓకే చెప్పి బిజీ అవుతున్నారు.

తాజాగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ ఆసక్తికరంగా మారటమే కాదు.. ఆమెను పదే పదే వార్తల్లోకి తీసుకొచ్చింది. సదరు ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలపై ఆమె ఓపెన్ అయ్యారు. తన పెళ్లి గురించి ఆమె చెబుతూ.. తాను ఎన్నో కలలతో వైవాహిక జీవితానికి సిద్దమైనట్లు పేర్కొన్నారు. తాను ప్రేమించిన సమ్రాట్ దహల్ తో 2010లో పెళ్లైందని.. కానీ ఆర్నెల్లకే తమ మధ్య బేధాభిప్రాయాలు వచ్చినట్లుగా పేర్కొన్నారు. దీంతో 2012లో ఆమె విడాకులు తీసుకున్నారు.

పెళ్లి తర్వాత తాను ఎన్నో కలలు కన్నానని.. అయితే.. ఆర్నెల్లకే తమ మధ్య గొడవలు మొదలైనట్లు చెప్పారు. తాను అమితంగా ప్రేమించిన భర్తే తనకు శత్రువుగా మారినట్లుగా చెప్పారు. తనకు ఎదురైన సమస్యలతో విడాకులు తీసుకోకుండా ఉండలేని పరిస్థితి అని.. దీంతో విడాకులు తీసుకున్నట్లు చెప్పారు.

తనలాంటి సమస్య మరెవరికీ రాకూడదన్న ఆమె.. ''పెళ్లి బంధంలో సంతోషంగా లేకుండా విడిపోవటమే మంచిది'' అంటూ కీలక సూచన చేశారు. వైవాహిక జీవితంపై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.