Begin typing your search above and press return to search.
నేపాల్ దేశానికి వత్తాసు పలికి..వివాదంలో ఇరుక్కున్న స్టార్ హీరోయిన్
By: Tupaki Desk | 21 May 2020 8:11 AM GMTనటి మనీషా కొయిరాలా సరిహద్దుల విషయంలో నేపాల్ ప్రభుత్వానికి మద్దతుగా ముందుకు వచ్చింది. అందులో మూడు భారతీయ ప్రాంతాలు లిపులేఖ్, కలపాణి మరియు లింపియాధూరలు మా దేశానికి సొంతం అంటూ తెలిపింది. నేపాల్ దేశ సంతతికి చెందిన బాలీవుడ్ నటి మనీషా కొయిరాలా.. తాజాగా నేపాల్ విదేశాంగ మంత్రి ప్రదీప్ గయావాలి ట్విట్టర్ పోస్టుకు సమాధానమిస్తూ.. నేపాల్ దేశ పటంలో లిపులేఖ్, కలపాణి, లింపియాధూరలను ప్రకటించిన నేపథ్యంలో మూడు గొప్ప దేశాల మధ్య శాంతియుతంగా, గౌరవప్రదమైన సంభాషణలు జరగాలని నటి తన ట్విట్టర్ పోస్ట్‌లో భారత్, నేపాల్, చైనా దేశాల గురించి ప్రస్తావించింది. ఈ సందర్బంగా "మా చిన్న దేశం యొక్క గౌరవాన్ని ఉంచినందుకు ధన్యవాదాలు. మూడు గొప్ప దేశాల మధ్య శాంతియుతంగా.. గౌరవప్రదమైన సంప్రదింపులు జరగాలని అందరం ఎదురుచూస్తున్నాము" అని ఆమె ట్వీట్ చేసింది.
మే 18న నేపాల్ కేబినెట్.. ఆ దేశ భూభాగాల పరిధిలోకి లిపులేఖ్, కలపాణి, లింపియాధూరలను కలిపి చెప్పుకొని ఆమోదించిన మ్యాప్ ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. ఈ విషయం పై మంగళవారం, నేపాల్ ప్రధాన మంత్రి కెపి శర్మ ఒలి 'ఆ మూడు భూభాగాలు నేపాల్ దేశానికి చెందినవని నొక్కిచెప్పి.. రాజకీయంగా అయినా.. దౌత్య ప్రయత్నాల ద్వారా అయినా భారతదేశం నుండి ఆ మూడు ప్రాంతాలను తిరిగి పొందాలని' ప్రతిజ్ఞ చేశాడు. అయితే ఈ విషయంలో నెటిజన్లు మనీషా పై ఫైర్ అవుతున్నారు. నెటిజన్‌లు స్పందిస్తూ ‘ మనీషా బేటా నువ్వు మనసుతో ఆలోచించూ లేక పోతే నిశ్శబ్దంగా ఉండూ.. అనవసరంగా దీనిని రాజకీయం చెయ్యొద్దు. మీరు నేపాల్ తరపున ఉన్నారు. మీ ప్రేమను అణచుకుంటే మంచిది.. లేదా నువ్వు ముంబాయిలో సంపాదించింది మొత్తం పోతుంది’ అని ట్వీట్ చేస్తున్నారు. దీనిపై చాలా మంది వివిధ రకాలుగా స్పందిస్తూ మనీషాని ట్రోల్ చేస్తున్నారు.