Begin typing your search above and press return to search.
మనీషా కొయిరాలను ఉతికి ఆరేస్తున్నారు
By: Tupaki Desk | 23 May 2020 11:10 AM GMTచైనా అండతో నేపాల్ దేశం ఇటీవల భారత్ లోని ప్రాంతాలను కలిపేస్తూ కొత్త మ్యాప్ ను అధికారికంగా విడుదల చేసింది. భారత్ కు షాకిచ్చింది. ఈ నిర్ణయాన్ని సమర్థిస్తూ నేపాల్ కే చెందిన బాలీవుడ్ ఫేమస్ హీరోయిన్ మనీషా కొయిరాలా ట్వీట్ చేయడం భారతీయులను షాక్ కు గురిచేసింది. భారత్, నేపాల్, చైనాలు దీనిపై చర్చించుకోవాలని మనీషా అనడం పుండుమీద కారం చల్లినట్టైంది. చైనాను ఈ విషయంలో ఇన్వాల్వ్ చేయడంపై అందరూ భగ్గుమంటున్నారు. ఆమెపై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ తారాస్థాయికి చేరుకున్నాయి.
తాజాగా మనిషా కొయిరాలాపై మాజీ విదేశాంగ శాఖ మంత్రి సుష్మ స్వరాజ్ భర్త, గవర్నర్ అయిన స్వారాజ్ కౌశల్ ట్విట్టర్ లో మండిపడ్డారు. ఆమె తీరును ఎండగట్టారు. నా కూతురు నీ ఒళ్లో కూర్చొని నీ సినిమా చూసిందని.. నా భార్య సుష్మా కూడా నిన్ను ఆదరించిందని.. అలాంటి నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదని గుర్తు చేశారు. మీ తాత, అన్న, తమ్ముడు అందరూ నేపాల్ ప్రధానులుగా సేవలు అందించారని.. భారత్ అండతో పాలించారని.. మీ నాన్న ప్రకాష్ కోయిరాలా నేతృత్వంలో నేపాలీ కాంగ్రెస్ సమస్యల్లో ఉంటే భారత్ మద్దతు ఇచ్చి వైనాన్ని గవర్నర్ స్వరాజ్ గుర్తు చేసుకున్నారు.
నేపాల్ ప్రజాస్వామ్యం కోసం భారత్ చెమటోడ్చిందని.. మనీషా అక్కడి రాజును పెళ్లాడినప్పుడు తాము సంతోషించామని వెల్లడించారు. భారత్-నేపాల్ స్పర్థల్లోకి చైనాను ఎలా లాక్కొస్తావ్ అంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు గవర్నర్ స్వరాజ్. చైనాను తేవడం ద్వారా భారత్-నేపాల్ మధ్య ఏళ్ల బంధానికి తూట్లు పొడిచినట్లైందని విమర్శించారు.