Begin typing your search above and press return to search.
సెకండ్ లైఫ్ లో ఏడేళ్ల పయనం
By: Tupaki Desk | 2 Dec 2019 5:17 PM GMTమనీషా కొయిరాలా .. పరిచయం అవసరం లేని పేరు ఇది. అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ సహా అన్ని పరిశ్రమల్లోనూ మనీషా నటించింది. బొంబాయి లాంటి క్లాసిక్ ప్రేమకథా చిత్రంలో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న మనీషా కొయిరాలా నాగార్జున సరసన కిల్లర్.. కమల్ హాసన్ సరసన భారతీయుడు.. అర్జున్ సరసన ఒకే ఒక్కడు వంటి చిత్రాల్లో నటించింది. కెరీర్ లో బోల్డ్ క్యారెక్టర్లతో సెన్సేషన్స్ క్రియేట్ చేసిన మనీషా కెరీర్ అనూహ్యంగా ఊహించని మలుపులతో ట్రామాలోకి వెళ్లింది.
అయితే ఒవేరియన్ క్యాన్సర్ కి గురై అన్ని రకాలుగా డిస్ట్రబ్ అవ్వడం తన జీవితంలో మరో కోణం. 2012 నవంబర్ లో తనకు క్యాన్సర్ ఉందని బయటపడింది. ప్రమాదకర క్యాన్సర్ కి అమెరికాలో చికిత్స అందించారు. చికిత్స ఫలించి ఆ తర్వాత ఆ మహమ్మారీ నుంచి బయటపడి రెండో లైఫ్ ని అందుకుంది. అనంతరం తిరిగి సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చి పలు చిత్రాల్లో నటించిన మనీషా కొయిరాలా.. మొన్నటికి మొన్న సంజు అనే చిత్రంలో నటించింది. లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ లోనూ నటించి మెప్పించింది.
మనీషా సెకండ్ లైఫ్ లో ఏడేళ్ల ప్రయాణం సాగిపోయింది. ఈ సందర్భంగా తనకు చికిత్స అందించిన ఆంకాలజిస్టులు.. డాక్టర్లకు సామాజిక మాధ్యమాల ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తూ నాటి అనుభవాల్ని ఫోటోల రూపంలో బయట పెట్టింది. మనీషా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నప్పటి ఆ ఫోటో ప్రస్తుతం అభిమానుల్లో వైరల్ గా మారింది. క్యాన్సర్ మహమ్మారీని జయించడం అంటే మృత్యువును జయించడమే. జీవితంలో కీలకమైన ఆ ఘట్టంలో సాధించిన విజయంపై మనీషా ఓ పుస్తకం రాశారు. `హీల్డ్: హౌ క్యాన్సర్ గేవ్ మి ఏ న్యూ లైఫ్` అనేది టైటిల్. ఈ మృత్యుంజయురాలు లైఫ్ లో ఇంకెన్నిటిని జయించనుందో?