Begin typing your search above and press return to search.

మనీషా చెబుతున్న మోటివేషనల్‌ మాటలు

By:  Tupaki Desk   |   4 Dec 2015 11:33 AM GMT
మనీషా చెబుతున్న మోటివేషనల్‌ మాటలు
X
నేపాలీ బ్యూటీ మ‌నీషా కొయిలారా గురించి ప్ర‌త్యేకించి ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. కింగ్ నాగార్జున స‌ర‌స‌న కిల్ల‌ర్ మూవీలో న‌టించింది మ‌నీషా. అర‌వింద్‌స్వామి స‌ర‌స‌న బొంబాయి సినిమాలో న‌టించి ప్ర‌పంచ‌వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. అటుపై టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్‌లో బోలెడ‌న్ని సినిమాల్లో న‌టించింది. కెరీర్ చ‌ర‌మాంకంలో ఉండ‌గా... మ‌నీషా జీవితంలో అనుకోని కుదుపు. ప్ర‌మాద‌క‌ర‌ క్యాన్స‌ర్ మ‌హ‌మ్మారీ ఐడెంటిఫై అయ్యింది. ఎలాగైతేనేం.. క్యాన్స‌ర్‌తో పోరాడి విజ‌యం సాధించింది. మృత్యుంజ‌యురాలిగా గుర్తింపు తెచ్చుకుంది.

ఇప్పుడు క్యాన్స‌ర్‌తో ఉన్న మ‌హిళ‌లంద‌రికీ ఆత్మ‌విశ్వాసాన్ని నింపే ప‌నిలో ఉంది. ఇటీవ‌లే మ‌హిళ‌లు - ఆరోగ్యం అన్న కాన్సెప్టుపై మాట్లాడుతూ.. అస‌లు రోగం వ‌స్తేనే మ‌నం ఆస్ప‌త్రికి వెళతాం. ఆ ప‌ద్ధ‌తిని మానుకుని ఇక నుంచి రెగ్యుల‌ర్ చెక‌ప్‌లు విధిగా చేయించుకోవాలి. ఆ అల‌వాటు అంద‌రిలోనూ ఉండాలి. అప్పుడే ఇలాంటి ప్ర‌మాద‌క‌ర రోగాల్ని జ‌యించ‌గ‌లం.. అని చెబుతోంది మ‌నీషా. నేను రెగ్యుల‌ర్ చెక‌ప్ కోసం వెళ్లిన‌ప్ప‌డే క్యాన్స‌ర్ ఐడెంటిఫై అయ్యింది. ఆ త‌ర్వాత డేర్‌గా నేను తీసుకున్న నిర్ణ‌యం వల్ల‌నే ఇంకా జీవించి ఉన్నాను. ఒక‌వేళ క్యాన్స‌ర్ అని తెలియ‌గానే నేను ఆత్మ‌హ‌త్య‌కు ప్ర‌య‌త్నించి ఉంటే ఏమ‌య్యేది. దేశంలో ఉన్న క్యాన్స‌ర్ రోగులంద‌రికీ అది నెగెటివ్ సంకేతాన్నిచ్చేది. ఈ ప్ర‌పంచానికి నేను చెడు చేసిన‌దానిని అయ్యేదాన్నే అంటూ మ‌నీషా త‌న మ‌నోగ‌తాన్ని చెప్పుకొచ్చారు.

నిజ‌మే అంత పెద్ద సెల‌బ్రిటీ అలాంటి ప‌నికి పాల్ప‌డి ఉంటే.. కామ‌న్ జ‌నం ప‌రిస్థితేంటి? ఇంకెంత దారుణంగా ఉండేదో క‌దూ? అయితే అమెరికాలో ఇలాంటి సూసైడల్‌ టెండన్సీలను హ్యాండిల్‌ చేయడానికి అక్కడ ఎక్పపర్టు కౌన్సలింగ్‌ నిపుణులు ఉన్నారట. ఇక్కడ మాత్రం లేరు అంటూ మనీషా ముగించింది. ఆమె చెబుతున్న మోటివేషనల్‌ మాటలు మాత్రం ఎందరికీ స్ఫూర్తిని కలిగిస్తున్నాయి.