Begin typing your search above and press return to search.

విడాకుల పాపం తనదే నాదే

By:  Tupaki Desk   |   30 May 2017 6:07 AM GMT
విడాకుల పాపం తనదే నాదే
X
ఈ మధ్య బాలీవుడ్ లో బ్రేకప్ కహానీలు ఎక్కువైపోయాయి. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకునే సంఘటనలు కూడా కనిపిస్తున్నాయి. ఎదుటివారిపై ఆరోపణలు నేరుగా చేయకపోయినా.. తమ తప్పు లేదని చెప్పడం ద్వారా.. అవతలివారిదే తప్పు అనుకునేలా చేస్తున్నారు. కొందరు మాత్రం సైలెంట్ గానే విడిపోతున్నారు.

అయితే.. గత జనరేషన్ టాప్ హీరోయిన్ మనీషా కొయిరాలా మాత్రం విడాకుల వ్యవహారంపై విభిన్నంగా స్పందించింది. నేపాల్ కు చెందిన వ్యాపారవేత్త సమ్రాట్ దహల్ ను 2010లో ఈమె పెళ్లాడింది. అయితే.. పెళ్లయిన రెండేళ్లకే విడాకులు కూడా తీసేసుకుంది. ఈ విడిపోవడం వ్యవహారానికి కారణం తానే అని.. తప్పు తనదే తప్ప.. అవతలి వ్యక్తిది ఏమీ లేదంటూ చెప్పి ఆశ్చర్యపరిచింది మనీషా. 'ఈ వ్యవహారానికి పూర్తి బాధ్యత నాదే. పెళ్లికి త్వరపడ్డం.. నాకు తగినది కాదని తెలుసుకోవడం.. అంతా పూర్తిగా నా వైపు నుంచే జరిగింది. పెళ్లి గురించి నాకు బోలెడన్ని కలలు ఉన్నాయి. అలాంటి అనుబంధం లేనపుడు విడిపోవడమే ఉత్తమం. ఇందులో బాధపడాల్సింది ఏమీ లేదు' అని చెప్పింది మనీషా కొయిరాలా.

ప్రస్తుతం ఈమె 46 సంవత్సరాలు కాగా.. డియర్ మాయా అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది మనీషా కొయిరాలా. మరోవైపు సంజయ్ దత్ మూవీలో.. సునీల్ దత్ భార్య నర్గీస్ గా కనిపించనుంది మనీషా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/