Begin typing your search above and press return to search.
అన్ని తప్పులు చేసి జీవితాన్ని నాశనం చేసుకున్నా
By: Tupaki Desk | 4 Jan 2019 11:04 AM GMTబాలీవుడ్ తో పాటు సౌత్ లో కూడా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన నేపాలీ ముద్దుగుమ్మ మనీషా కోయిరాలా జీవితంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొంది. ముఖ్యంగా మనీషా కోయిరాల క్యాన్సర్ బారిన పడి మరణం అంచుల వరకు వెళ్లింది. క్యాన్సర్ తో పోరాడి జీవితాన్ని గెలిచిన మనీషా కోయిరాలా ఆ తర్వాత తన జీవితంలో చాలా మార్పులు వచ్చాయట. క్యాన్సర్ కు ముందు తాను చెడు అలవాట్లకు బానిసైనట్లుగా మనీషా తన బయోగ్రఫీలో పేర్కొంది.
ఇటీవలే మనీషా కోయిరాలా తన జీవిత చరిత్ర పుస్తకం హేడెల్ విడుదల చేసింది. ఆ పుస్తకంలో తన జీవితంలోని చీకటి కోణంను ఆవిష్కరించింది. హీరోయిన్ గా బిజీగా ఉన్న సమయంలో ప్రపంచం మొత్తం తన కాళ్ల వద్ద ఉందన్నట్లుగా ఫీల్ అయ్యాను, ఒంటరితనం భరించలేక బాగా తిరిగేదాన్ని, పార్టీలకు ఎక్కువగా వెళ్తూ జీవితాన్ని ఎంజాయ్ చేసేదాన్ని. అతి తక్కువ సమయంలోనే మద్యంకు ఎక్కువగా బానిస అయ్యాను, ఆ కారణం వల్లే నన్ను క్యాన్సర్ పట్టి పీడిచ్చినట్లుగా భావిస్తున్నాను.
క్యాన్సర్ తో పోరాడిన తర్వాత ఆ తప్పులన్నీ నాకు తెలిసి వచ్చాయి. అందుకే క్యాన్సర్ వ్యాది నా జీవితానికి ఒక బహుమతిగానే నేను భావిస్తున్నట్లుగా మనీషా పేర్కొంది. హీరోయిన్ గా బిజీగా ఉన్న సమయంలో చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువగా కోపగించుకునేదాన్ని, ప్రతి విషయంలో కూడా అతిగా రియాక్ట్ అయ్యేదాని, కాని ఇప్పుడు ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచించి స్టెప్ తీసుకుంటున్నాను. నా జీవితంలోని కొన్ని సంఘటనలు నన్ను పూర్తిగా మారిపోయేలా చేశాయని మనీషా తన హేడెల్ పుస్తకంలో రాసింది.