Begin typing your search above and press return to search.
ఇద్దరు పిల్లల్ని దత్తత తీసుకుంటున్నా-మనీషా
By: Tupaki Desk | 5 Aug 2015 5:41 AM GMTఒక కథానాయిక జీవితం ఈ ప్రపంచానికి ఇన్ స్పిరేషన్. జీవితం అంటే ఏమిటి? దానిని ఎలా ఎదురీదాలి? కష్టంలోనూ మొక్కవోని ధీక్షతో ఎలా గట్టెక్కాలి? అనేదానికి లైవ్ ఎగ్జాంపుల్ మనీషా కొయిలారా జీవితం. ఈ నేపాలీ బ్యూటీ గొప్ప అందగత్తె. అద్భుతమైన నటి. అందుకే ఉత్తరాదిన కపూర్ ల రాజ్యం కొనసాగుతున్న రోజుల్లోనే అందరినీ పక్కకు నెట్టేసి తనకంటూ ఓ మార్క్ తో బాలీవుడ్ టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. అంతేనా అటు బాలీవుడ్ తో పాటు సౌత్ లోనూ స్టార్ హీరోయిన్ గా రాజ్యమేలింది.
విధి విచిత్రమైనది.. అనూహ్యంగా జీవితంలోకి క్యాన్సర్ మహమ్మారీ ప్రవేశించింది. బ్రెస్ట్ క్యాన్సర్ మనీషా జీవితాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. అంత ఉన్నత స్థానానికి ఎదిగిన కెరీర్ ని వదిలి బాధల్లోకి వెళ్లాల్సి వచ్చింది. అయినా పట్టుదలతో క్యాన్సర్ ని జయించింది. తిరిగి ఇటీవలి కాలంలో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం కొన్ని సినిమాల్లో నటిస్తున్న మనీషా సంసార జీవితాన్ని కొనసాగించాలన్న ఆశను వ్యక్తం చేసింది. అయితే అది పెళ్లి చేసుకునే ఆలోచన కాదు. ఓ ఇద్దరు పిల్లల్ని దత్తత తీసుకుంటా. భర్త ఉండాలా? వద్దా? అనేది ఇంకా నిర్ణయించలేదు.. అని చెప్పింది.
ఇప్పటికి కెరీర్ లో 70 సినిమాల్లో నటించాను. రోహిత్ కౌశిక్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నా. ఇందులో అలనాటి నాయికగా కనిపిస్తాను. దీపిక నావెల్ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తున్నానని చెప్పింది. అంతేకాదు త్వరలోనే యునైటెడ్ నేషన్స్ లో తన స్పీచ్ లు వినిపించడానికి వెళుతునాన్ననని, క్యాన్సర్, నేపాల్ ఎర్త్ కేక్, ఆడపిల్లల చదువులపై మాట్లాడనున్నానని మనీషా తెలిపారు.