Begin typing your search above and press return to search.
పుస్తకం రాస్తున్న భారతీయుడు భామ
By: Tupaki Desk | 18 May 2017 5:55 AM GMTఇప్పుడు చాలామంది సీనియర్ నటులు పుస్తకాలు రాసేస్తున్నారు. తమ జీవితాలను పుస్తకరూపంలో మలిచి.. అభిమానులకు కొత్త అనుభవాన్ని పంచుతున్నారు. వీరి జీవితంలో జరిగిన ఎన్నో తెలియని సంఘటనలు.. వాటి వెనక ఉన్న కారణాలు తెలుసుకునే అవకాశం ఈ పుస్తకాలతో కలుగుతోంది.
ఇప్పుడు భారతీయుడు.. ఒకే ఒక్కడు వంటి సౌత్ చిత్రాలతో దేశ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించిన బాలీవుడ్ భామ మనీషా కొయిరాలా కూడా ఓ పుస్తకం రాస్తోంది. తన జీవితం గురించే రాస్తున్నా ఈ పుస్తకం ఆటోబయోగ్రఫీ మాత్రం కాదంటోంది మనీషా. ఏ ఏడాదిగా ఈమె ఓ ఇంటర్నేషనల్ పబ్లిషింగ్ హౌస్ తో డిస్కషన్స్ జరుపుతూ.. పుస్తకాన్ని తెగ రాసేస్తోంది. 'నాకు ఆరోగ్యంగా ఉండడం చాలా ఇష్టం. అందుకే ఎక్కువగా చదువుతూ ఉంటాను. నేను నేర్చుకున్న విజ్ఞానాన్ని అందరికీ పంచుదామన్నదే నా ఆలోచన. ఇది నా ఆటోబయోగ్రఫీ కాదు.. అయితే నా జీవితం.. సినీ జీవితం గురించిన సంగతులు మాత్ర ఉంటాయి. నాకు ఆరోగ్యం బాలేనపుడు.. చాలా నోట్స్ రాశాను. అవే ఇప్పుడు నా పుస్తకానికి మూలం' అంటోంది మనీషా కొయిరాలా.
ఈ భామ క్యాన్సర్ తో బాధపడి.. ఇప్పుడు ఆ మహమ్మారి నుంచి బయటపడ్డ సంగతి తెలిసిందే. క్యాన్సర్ తో మనీషా కొయిరాలా చేసిన పోరాటమే ఈమె రాస్తున్న బుక్ కి మెయిన్ థీమ్. ప్రస్తుతం సంజయ్ దత్ మూవీలో నర్గీస్ పాత్రలో మనీషా నటిస్తుండగా.. త్వరలో డియర్ మాయ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సీనియర్ బ్యూటీ.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/