Begin typing your search above and press return to search.

ఆ ముద్దు ముచ్చట గుట్టు చెప్పింది

By:  Tupaki Desk   |   24 July 2015 5:18 PM GMT
ఆ ముద్దు ముచ్చట గుట్టు చెప్పింది
X
సంగీతదర్శకుడు జీవీ ప్రకాష్‌ కుమార్‌ హీరోగా నటించిన 'త్రిష లేదా నయనతార' తెలుగులో రిలీజ్‌ కి వస్తోంది. ఈ చిత్రంలో ఇద్దరు కథానాయికల్లో ఒక నాయికగా ఆడిపాడింది తమిళమ్మాయ్‌ మనీషా యాదవ్‌. ఇటీవలే టీజర్‌ రిలీజైంది. ఈ టీజర్‌ చూసినవారంతా అందులో రొమాంటిక్‌ గాళ్‌ ఎవరూ అంటూ ఆరాలు తీయడం మొదలెట్టారు.

వాస్తవానికి ఈ అమ్మడు నేరుగా తెలుగు సినిమాల్లో నటించలేదు కానీ, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఇంతకుముందే వళక్కు ఎన్‌ 18/9 అనే తమిళ అనువాదంతో తెలుగు వారికి సుపరిచితమైంది. ఇప్పుడు తన రెండో సినిమా రిలీజవుతోంది. ఈ సందర్భంగా మనీషా మాట్లాడుతూ.. కొన్ని ఆసక్తికర సంగతులు చెప్పింది. ముఖ్యంగా టీజర్‌ లో జీవీని ముద్దులాడే సన్నివేశం గురించే జనాలంతా ముచ్చటించుకుంటున్నారు కదా? అని ప్రశ్నిస్తే.. అవును.. అది యూత్‌ కి నచ్చే పాత్ర. క్యారెక్టర్‌ డిమాండ్‌ మేరకే ముద్దు సన్నివేశాల్లో నటించానని తెలివిగా సమాధానమిచ్చింది. అంతేనా తొలి సినిమా విజయం సాధించినా.. ఆ తర్వాత తనవైపు వచ్చిన అవకాశాలన్నిటినీ ఒప్పుకోలేదని చెప్పింది. సెలక్టివ్‌ గా ఎంపిక చేసుకుంటున్నా.

ఇప్పటివరకూ యువహీరోలతోనే ఛాన్సులొచ్చాయి. స్టార్‌ హీరోలతో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నానని చెప్పింది. బీకాం పూర్తి చేసి సినిమా రంగంలోకి వచ్చాను. సినిమా నేపథ్యం లేకపోయినా రాణిస్తున్నా. ఇదంతా ప్రతిభతోనే అంటూ చెప్పుకొచ్చింది.