Begin typing your search above and press return to search.

నేను కాపీ కొట్టా...కాని అందుకు కారణముంది

By:  Tupaki Desk   |   14 Oct 2018 1:53 PM GMT
నేను కాపీ కొట్టా...కాని అందుకు కారణముంది
X
ఈమద్య కాలంలో దాదాపు అన్ని సినిమాల గురించి సోషల్‌ మీడియాలో కాపీ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ సీన్‌ ఆ సినిమా లోంచి కాపీ కొట్టాడని, ఈ పాట ఆ సినిమాలో ఉందని, ఈ ఫైట్‌ గతంలో వచ్చిన ఆ సినిమా ఫైట్‌ అని, కామెడీ సీన్స్‌, రొమాన్స్‌ సీన్స్‌ ఇలా అన్ని విషయాల్లో కూడా గత సినిమాలతో పోల్చుతూ కాపీ ఆరోపణలు చేస్తున్న విషయం తెల్సిందే. ఈ కాపీ వివాదాన్ని అత్యధికంగా ఎదుర్కొంటున్న వారు సంగీత దర్శకులు, ఆ తర్వాత సినీ దర్శకులు.

తెలుగు సంగీత దర్శకుల్లో తమన్‌ అత్యధికంగా కాపీ వివాదాలను ఎదుర్కొంటున్నాడు. తమన్‌ పాటలు, వేరే పాటలతో జత చేసి దీని నుండి ఇది కాపీ అంటూ గతంలో పలు సార్లు సోషల్‌ మీడియాలో కొందరు రచ్చ చేసిన విషయం తెల్సిందే. తాజాగా అరవింద సమేత చిత్రం విషయంలో కూడా కాపీ క్యాట్‌ అంటూ తమన్‌ పై విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఆ విమర్శలను తమన్‌ కొట్టి పారేశాడు. తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ కాపీ పై స్పందించాడు.

ఏ సంగీత దర్శకుడు కూడా ట్యూన్‌ ను కాపీ చేయాలని కోరుకోడు, సొంతంగా ట్యూన్‌ చేసిన పాటలే పూర్తి సంతృప్తి ఇస్తాయి. కాని కొన్ని సార్లు నిర్మాతలు మరియు దర్శకులు ఒత్తిడి మేరకు ఇతర సినిమాల పాటలను లేదా ట్యూన్స్‌ ను కాపీ చేయాల్సి వస్తుందని, తాను కెరీర్‌ లో కొన్ని అలా చేశానని, ‘ఆది’ సినిమాలోని చికు చికు బం బం... పాటను ఒక ఇంగ్లీష్‌ పాట నుండి కాపీ చేసినట్లుగా మణిశర్మ ఒప్పుకున్నాడు. ఇంకా కొన్ని పాటలు కూడా మణిశర్మ కాపీ చేసినట్లుగా సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. అయితే ఇతర సంగీత దర్శకులతో పోల్చితే మణిశర్మ కాపీ విషయంలో కాస్త తక్కువే అని సోషల్‌ మీడియా టాక్‌.