Begin typing your search above and press return to search.
అఖిల్ సినిమాకు మూడో మ్యూజిక్ డైరెక్టర్
By: Tupaki Desk | 13 Aug 2015 12:21 PM GMTఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో అక్కినేని అఖిల్ అరంగేట్ర సినిమా ఒకటి. టాలీవుడ్ లో ఏ అరంగేట్రం హీరో సినిమాకు జరగనంత బిజినెస్ జరగడాన్ని బట్టే ఈ సినిమా మీద ఎలాంటి అంచనాలున్నాయో అర్థం చేసుకోవచ్చు. వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు టెక్నీషియన్స్ విషయంలోనూ అస్సలు రాజీ పడట్లేదు. కొత్త హీరో సినిమా అనగానే.. జనాలు పాటలు, ఫైట్ల మీద ప్రత్యేకంగా దృష్టిసారిస్తారు కాబట్టి ఈ విసయంలో వినాయక్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. యాక్షన్ సన్నివేశాల కోసం విదేశీ నిపుణుల సహకారం తీసుకుంటున్న వినాయక్.. ఈ సినిమాకు ముగ్గురు సంగీత దర్శకుల నుంచి ఔట్ పుట్ తీసుకుంటుండటం విశేషం. పాటల కోసం ఇప్పటికే థమన్, అనూప్ రూబెన్స్ లను ఎంచుకున్న సంగతి తెలిసిందే. ఇద్దరు సగం సగం పాటలు పంచుకుంటున్నారు.
ఐతే బ్యాగ్రౌండ్ స్కోర్ బాధ్యతలు మాత్రం ఈ ఇద్దరిలో ఎవరికీ అప్పగించలేదు. ఆ రెస్పాన్సిబిలిటీ సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మకు ఇచ్చారు. టాలీవుడ్ లో మాస్ సినిమాలకు బ్యాగ్రౌండ్ స్కోర్ ఇవ్వడంలో మణిశర్మ శైలే వేరు. యాక్షన్, ఎమోషనల్ సీన్స్ లో ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకునే బ్యాగ్రౌండ్ స్కోర్ ఇస్తాడని మణిశర్మకు మంచి పేరుంది. గత కొన్నేళ్లలో సంగీత దర్శకుడిగా మణిశర్మ బాగా జోరు తగ్గించేసినా.. కొన్ని పెద్ద సినిమాలకు మాత్రం ఆర్.ఆర్. చేస్తూ వస్తున్నాడు. ఈ ఏడాది ‘టెంపర్’ సినిమాకు కూడా బ్యాగ్రౌండ్ స్కోర్ తో దుమ్ముదులిపాడు. మణి టాలెంట్ ఏంటో వినాయక్ కు బాగా తెలుసు కాబట్టే.. అఖిల్ సినిమాకు ఆయనతో ఆర్.ఆర్.చేయించుకుంటున్నాడు. మొత్తానికి అఖిల్ తొలి సినిమాతోనే ముగ్గురు ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్లతో పని చేస్తుండటం విశేషమే