Begin typing your search above and press return to search.
మెలోడీ బ్రహ్మ రిటైర్మెంటా?
By: Tupaki Desk | 18 Dec 2017 11:50 AM GMTమెలోడీ బ్రహ్మ అంటే ఇప్పటికే గుర్తొచ్చే పేరు మణిశర్మ. టాలీవుడ్ లో ఆయన మ్యూజిక్ కి చిందులేయని హీరో లేడు. మెలోడీ సాంగ్స్ అయినా ఫాస్ట్ బీట్ రిథమ్ పాటలైనా సినిమాకు తగ్గట్టుగా మ్యూజిక్ అందించేవారు. ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లో ఆయనకు ఆయనే పోటీ. దాదాపు స్టార్ హీరోలందరి సినిమాలకు అయన సంగీతాన్ని అందించారు. అంతే కాకుండా బడా దర్శకులు కూడా ఆయన సంగీతాన్ని ఇష్టపడి కొన్ని ప్రతిష్టాత్మక చిత్రాలకు సలెక్ట్ చేసుకునేవారు.
ముఖ్యంగా ఎప్పుడే కీరవాణితో వర్క్ చేసే కె.రాఘవేంద్ర రావు కూడా ఆయనను ఓ సారి పక్కనపెట్టి వెంకటేష్ తో చేసిన సుభాష్ చంద్రబోస్ సినిమాకు ఎంచుకున్నారు. ఇండస్ట్రీ టాప్ హిట్ సినిమాలకు ఆయన వర్క్ చేశారు. అంతగా తన సంగీతంతో అందరిని ఆకర్షించిన మెలోడీ బ్రహ్మ ఇక రిటైర్మెంట్ తీసుకోవాలని అనుకుంటున్నారట. ఎందుకంటే గత కొంత కాలం నుంచి అనుకున్నంత రేంజ్ లో ఆయన పాటలు అంతగా హిట్ కావడం లేదు. సినిమాలు దారుణంగా డిజాస్టర్స్ అవ్వడం కూడా ఆయనని కొంచెం కలవరపెడుతోంది.
ఈ సంవత్సరంలో 10 సినిమాలను చేసిన మణిశర్మ ఏ సినిమాతో గుర్తింపు పొందలేదు. ఫ్యాషన్ డిజైనర్ - అమీ తుమీ - లై వంటి సినిమాలను చేసినా.. ఆయన మ్యూజిక్ కు పేరు రాలేదు. ఇక ప్రస్తుతం శిరీష్ ఒక్క క్షణం రిలీజ్ కు రెడీగా ఉంది. మ్యూజిక్ పరంగా ఆయన ఏ స్థాయిలో కష్టపడుతున్నా ఆదరణ దక్కడం లేదని ఇక సంగీత వృత్తికి ఈ ఏడాది ఒక్క క్షణం సినిమాతోనే గుడ్ బయ్ చెప్పాలని అనుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.
మరి ఇది ఎంతవరకు నిజం అనేది తెలియదు గాని ఇంకా మణిశర్మ అధికారికంగా వివరణ ఇవ్వలేదు.