Begin typing your search above and press return to search.

మళ్లీ మెగా క్యాంప్ లోకి మణి శర్మ

By:  Tupaki Desk   |   11 Feb 2017 2:08 PM IST
మళ్లీ మెగా క్యాంప్ లోకి మణి శర్మ
X
సంగీత దర్శకుడు మణిశర్మ ఇప్పుడు రేస్ లో వెనకబడిపోయాడు కానీ.. ఒకప్పుడు టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లో ఒకడిగా ఉండేవాడు. ఇప్పటికీ చాలా సినిమాలకు బీజీఎం మణిశర్మతోనే చేయించుకుంటారు పలువురు హీరోలు. గతంలో మెగా క్యాంప్ కు ఆస్థాన విద్వాంసుడు టైప్ లో ఉండేది ఈ కంపోజర్ ట్రాక్ రికార్డ్.

రీసెంట్ గా ఎక్కడికి పోతావు చిన్నవాడాతో టాలీవుడ్ ని ఆకట్టుకున్న దర్శకుడు వీఐ ఆనంద్.. త్వరలో అల్లు శిరీష్ హీరోగా ఓ మూవీ చేయబోతున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించనుండడం విశేషం. ఇది మెగాక్యాంప్ లోకి మణిశర్మ రీఎంట్రీగా చెప్పచ్చు. గతేడాది నాని మూవీ జెంటిల్మెన్ కి సంగీతం అందించి.. తనలో స్టాండర్డ్స్ ఏ మాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసుకున్నాడు మణిశర్మ. గతంలో పూరీ-పవన్ కళ్యాణ్ ల కాంబినేషన్ లో వచ్చిన కెమేరామ్యాన్ గంగతో రాంబాబు.. మెగా క్యాంప్ లో మణిశర్మ చేసిన చివరి మూవీ.

అంతకు ముందు రామ్ చరణ్ తో రచ్చ.. పవన్ తో తీన్ మార్.. అల్లు అర్జున్ కి వరుడు.. చెర్రీ లాంఛింగ్ మవీ చిరుత.. మెగాస్టార్ తో ఇంద్ర.. అంజి.. ఇలా చెప్పుకుంటూ పోతే మెగా హీరోలతో మణిశర్మ చేసిన సినిమాలు చాలానే ఉంటాయి. ఇప్పడు మెగా హీరో అల్లు శిరీష్ కి ఈ సీనియర్ కంపోజర్ సంగీతం అందించనుండడం.. కచ్చితంగా సినిమాకు అదనపు ఆకర్షణ అవుతుందని చెప్పాల్సిందే.