Begin typing your search above and press return to search.

పాపం.. శ్రీకాకుళం పాప.. ఇలా!!

By:  Tupaki Desk   |   24 Dec 2016 1:30 AM GMT
పాపం.. శ్రీకాకుళం పాప.. ఇలా!!
X
సిద్ధు ఫ్రం శ్రీకాకుళం అంటూ వచ్చిన అల్లరి నరేష్ మూవీలో హీరోయిన్ గా నటించిన బ్యూటీ మంజరి ఫడ్నిస్. ఆ తర్వాత కూడా తెలుగులో ఇంకోసారి.. శుభప్రదం.. శక్తి.. సినిమాల్లో నటించినా బ్రేక్ రాలేదు సరికదా.. ఆ పదానికి దగ్గరగా కూడా రాలేకపోయింది. ఇటు తెలుగులోనే కాకుండా.. హిందీ.. కన్నడ.. మరాఠీ.. మలయాళం.. బెంగాలీ సినిమాల్లో నటించేసిన అనుభవం కూడా మంజరికి ఉంది.

ఇన్ని భాషల్లో నటించాక.. ఎక్కడో ఓ చోట అయినా సెటిల్ అయిపోవాలి కానీ.. ఇంకా మంజరికి ఆ అదృష్టం దక్కలేదు. కాకపోతే బాలీవుడ్ లో మాత్రం వరుసగా ఆఫర్స్ వస్తుండడం ఒక్కటే చెప్పుకోవాల్సి అంశం. ప్రస్తుతం ఈ భామ 'జీనా ఇసీ కా నామ్ హై' అనే మూవీలో నటిస్తుండగా.. ఇప్పుడా మూవీ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో అర్బాజ్ ఖాన్.. అశుతోష్ రాణా లాంటి హేమాహేమీలు నటించినా.. పోస్టర్ లో మాత్రం మంజరినే ముందుంచి బాగా ఫోకస్ చేశారు.

ఇలా మంజరి పోస్టర్ ముందు పెట్టడానికి అసలు కారణం.. అమ్మడు చూపించి క్లీవేజ్ అందాలే. ట్యాలెంటెడ్ అనిపించకుని కూడా.. చివరకు ఇలా క్లీవేజ్ షోకులు చూపించి పోస్టర్ల పైకి ఎక్కాల్సి రావడం నిరుత్సాహపరిచే విషయమే. అయితే.. మార్చ్ 3న విడుదలకానున్న జీనా ఇసీ కా నామ్ హై చిత్రంలో.. కీలకమైన రోల్ చేస్తోంది కాబట్టి.. ఇది సక్సెస్ అయితే.. మంజరి ఫేట్ మారచ్చేమో!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/