Begin typing your search above and press return to search.

చైతూ హీరోయినే కొత్త కోడి

By:  Tupaki Desk   |   2 July 2016 3:35 PM GMT
చైతూ హీరోయినే కొత్త కోడి
X
విశాల్‌ని అటు తమిళంలోనూ - ఇటు తెలుగులోనూ హీరోగా నిల‌బెట్టిన సినిమా పందెం కోడి. లింగు స్వామి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఆచిత్రం రెండు చోట్లా ఘ‌న విజ‌యం సాధించింది. విడుద‌లై ప‌దేళ్ల‌కిపైనే అయినా... ఇప్ప‌టికీ ఆ సినిమాని గుర్తు చేసుకొంటుంటారు ప్రేక్ష‌కులు. సీక్వెల్‌ ని తెర‌కెక్కించాల‌ని లింగుస్వామి - విశాల్ ఎప్ప‌ట్నుంచో ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు కానీ... అది ఇటీవ‌లే కొలిక్కి వ‌చ్చింది. త్వ‌ర‌లోనే సినిమాని సెట్స్‌ పైకి తీసుకెళ్ల‌బోతున్నారు. తాజాగా హీరోయిన్‌ ని కూడా ఎంపిక చేసిన‌ట్టు స‌మాచారం. నాగ‌చైత‌న్య‌తో క‌లిసి `సాహ‌సం శ్వాస‌గా సాగిపో`లో న‌టిస్తున్న మంజిమ మోహ‌న్ ఆ అవ‌కాశాన్ని చేజిక్కించుకొందని తెలిసింది.

పందెంకోడిలో హీరోయిన్‌ గా మీరాజాస్మిన్ న‌టించిన విష‌యం తెలిసిందే. ఆ సినిమాకి మీరా యాక్టింగ్ కూడా ఓ పెద్ద ఎస్సెట్‌ గా నిలిచింది. ఇప్పుడు మ‌ళ్లీ ఆమెనే ఎంపిక చేసుకోవ‌చ్చు కానీ మీరా సినిమాల‌కి దూర‌మై చాలా కాల‌మైంది. ఆమె రూపు రేఖ‌లు కూడా మారిపోయాయి. అందుకే కొత్త కోడిగా మంజిమ‌నే సెలెక్ట్ చేసుకొన్నారు. క్రేజీ ప్రాజెక్టులో అవ‌కాశాన్ని చేజిక్కించుకొన్న మంజిమ అదృష్ట‌వంతురాల‌నే చెప్పాలి.