Begin typing your search above and press return to search.

సాహసం హీరోయిన్ ప్రేమలో పడిందా?

By:  Tupaki Desk   |   3 July 2017 3:58 PM GMT
సాహసం హీరోయిన్ ప్రేమలో పడిందా?
X
మలయాళ బ్యూటీ మంజిమా మోహన్.. శాండల్ వుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ కాలం నుంచి ఫుల్ పాపులర్. నాగ చైతన్య మూవీ సాహసం శ్వాసగా చిత్రంలో.. హీరోయిన్ గా నటించిన ఈ భామకు.. ఆ చిత్రం కలిసి రాలేదు. డీమానిటైజేషన్ టైంలో విడుదల అయిన సాహసం శ్వాసగా సాగిపో.. ఫెయిల్యూర్ గా మిగిలిపోయి.. ఈ భామ ఆశలపై నీళ్లు చల్లేసింది.

తెలుగులో అంటే మళ్లీ అవకాశాలు రాలేదు కానీ.. తమిళ్ లో మాత్రం ప్రస్తుతం రెండు సినిమాలు చేసేస్తోంది. ఇప్పుడీ బ్యూటీ ప్రేమలో పడిపోయిందని.. డేటింగ్ వరకూ వెళ్లిపోయిందని కోలీవుడ్ టాక్. సెన్సేషనల్ యంగ్ కంపోజర్ అనిరుధ్ రవిచందర్ కజిన్ హృషికేష్ తో మంజిమా మోహన్ ప్రేమలో మునిగి తేలుతోందట. ఈ కుర్రాడు ఎరో కాదు.. ధనుష్ హిట్ మూవీ రఘువరన్ బీటెక్ లో.. హీరోకు తమ్ముడి పాత్రలో నటించాడు హృషికేష్. గత కొన్ని నెలలుగా హృషికేష్- మంజిమా మోహన్ లు బాగా క్లోజ్ అయిపోయారని తెలుస్తోంది.

అయితే.. రిలేషన్ షిప్స్ విషయంలో అనిరుధ్ ని మాత్రం ఇన్ స్పిరేషన్ తీసుకోవద్దని సలహా ఇస్తున్నారట చాలా మంది. కంపోజర్ అనిరుధ్- సింగర్ కం యాక్ట్రెస్ అయిన ఆండ్రియాల మధ్య సంథింగ్ సంథింగ్ అని వినిపించడమే కాదు.. కొన్ని సాక్ష్యాలు కనిపించాయ్ కూడా. మరి ఈ కుర్రాడు జనాల మాట వింటాడో.. కజిన్ ని ఫాలో అయిపోతాడో!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/