Begin typing your search above and press return to search.
చైతూ హీరోయిన్.. ఏలియన్ భాష
By: Tupaki Desk | 30 Nov 2015 1:30 PM GMTటాలీవుడ్‌లో యువతరం నాయికల హవా సాగుతోందిప్పుడు. పొరుగు నుంచి ఒకరి వెంట ఒకరిగా వచ్చి తెలుగు సినీపరిశ్రమనే అల్లుకుపోతున్నారంతా. ఇక్కడ హిట్టు మీద హిట్టు కొడుతూ వరసగా అవకాశాలందుకుంటున్నారు. మన తెలుగమ్మాయిలు ఓ వైపు తమిళ్ - మలయాళం వైపు వెళ్లి నిరూపించుకుంటుంటే అట్నుంచి ఇటు కొందరు తారుమారవుతున్నారు. ఆ తరహాలోనే సీన్ లోకి ఎంట్రీ ఇచ్చింది మాంజిమా మోహన్
నాగచైతన్య సరసన `సాహసం శ్వాసగా సాగిపో` చిత్రంలో నటిస్తోంది ఈ అమ్మడు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ అమ్మడి గురించి ఒకటే కలవరింత. చైతన్య సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇస్తోంది. పైగా స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ తో పనిచేసే ఛాన్స్ అందుకుంది. అందుకే ఈ అమ్మడి గురించిన ఆసక్తికర చర్చ సాగుతోంది. మాంజిమ ఇప్పటికే మలయాళంలో ఓ హిట్ కొట్టింది. తమిళ్ బాగా మాట్లాడుతుంది. అక్కడి పరిశ్రమతో తనకి చక్కని అనుబంధం ఉంది. కానీ తెలుగు వారితోనే ఈ అమ్మడికి చిక్కంతా. ఇక్కడ భాష తెలీదు. ఆ సంగతినే గుర్తు చేస్తూ అసలు తనకి తొలి తెలుగు సినిమా ఛాన్స్ ఇచ్చిన గౌతమ్ మీనన్ ని ఆకాశానికెత్తేసింది.
వద్దు సార్.. ఓన్లీ తమిళ్ వరకే నటిస్తానంటే ఆయన కన్విన్స్ చేసేశారు. ఆయన ఇచ్చిన కాన్ఫిడెన్స్ వల్లనే తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నా అంటూ చెప్పుకొచ్చింది. తెలుగు మాట్లాడడం అంటే ఏలియన్ భాష మాట్లాడినట్టే అంటూ భయపడిపోయింది. కాకపోతే మొదట్లో కాస్త ఇబ్బంది అనిపించినా.. ఇప్పుడు మాత్రం తెలుగు పదాలు బాగానే వాడేస్తోందట. చెన్నయ్ లో చదువుకున్న మలయాళీ చిన్నది కాబట్టి.. తమిళం ఈజీగానే వచ్చినా.. తెలుగు కోసం నానా కూల్ డ్రింకులూ తాగేశాను అంటోంది.