Begin typing your search above and press return to search.
‘సాహసం..’ క్లైమాక్స్ చూసి ఏడ్చేశాడట
By: Tupaki Desk | 2 Nov 2016 11:30 AM GMTతన తొలి సినిమా మలయాళంలో చేసిన ‘ఒరు వడక్కం సెల్ఫీ’ అయినప్పటికీ.. రెండో సినిమా ‘సాహసం శ్వాసగా సాగిపో’ విషయంలోనే ఎక్కువ ఎగ్జైట్మెంట్ తో ఉన్నానని అంటోంది మలయాళ కుట్టి మాంజిమా మోహన్. ఈ సినిమా తన కెరీర్లో చాలా చాలా స్పెషల్ అని.. ఎంతో ఇష్టపడి.. కష్టపడి చేసిన ఈ సినిమా తన కెరీర్ కు పెద్ద బూస్ట్ అవుతుందని మాంజిమా చెప్పింది. ఈ సినిమా.. తన కెరీర్ విశేషాలపై ఆమె ఇంకా ఏమందంటే..
‘‘మా నాన్న మోహన్ మలయాళంలో సినిమాటోగ్రాఫర్. తాను చేసే సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ అవసరమైతే నన్ను తీసుకెళ్లిపోయారు. ఆ తర్వాత హీరోయిన్ కావాలన్న ఆశ పుట్టింది. మా నాన్నకు చెబితే ముందు చదువు పూర్తి చేయమన్నారు. ఆ తర్వాత ‘ఒరు వడక్కం సెల్ఫీ’ సినిమాతో హీరోయిన్ గా పరిచయమయ్యాను. ఐతే ఆ సినిమాలో నా నటన గురించి చాలామంది నెగెటివ్ కామెంట్లు చేశారు. నన్ను సినిమాలు మానుకోమంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేశారు. దీంతో చాలా భయపడిపోయాను. అలాంటి టైంలో గౌతమ్ మీనన్ గారి నుంచి ఫోన్ వచ్చింది. షాకయ్యాను. ఆడిషన్ చేసేటపుడు నన్ను తమిళ వెర్షన్ వరకే తీసుకుంటారనుకున్నా. కానీ తెలుగులో కూడా అవకాశమిచ్చాడు. తమిళం నాకు పెద్ద ఇబ్బంది కాదు. కానీ తెలుగులో ఎలా అనుకున్నా. గౌతమ్ గారు ఏం పర్వాలేదన్నారు. లాంగ్వేజ్ విషయంలో ఇబ్బంది రాకుండా ఒక అసిస్టెంటును పెట్టారు. తెలుగులో నేను చేసిన తొలి సన్నివేశాన్ని మరిచిపోలేను. ఆ సీన్ చేశాక సెట్లో ఉన్న వాళ్లందరూ క్లాప్స్ కొట్టారు. ‘సాహసం శ్వాసగా సాగిపో’ మధురానుభూతుల్ని మిగిల్చింది. ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ఈ సినిమా చూస్తూ క్లైమాక్సులో ఉద్వేగానికి గురయ్యాను. మా నాన్న కూడా క్లైమాక్స్ చూస్తూ ఏడ్చేశారు. అంతగా సినిమా స్పందింపజేస్తుంది’’ అని మాంజిమా చెప్పింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/