Begin typing your search above and press return to search.
మంజుల ఘట్టమనేని సరికొత్త ప్రయాణం!
By: Tupaki Desk | 8 Nov 2020 10:54 AM GMTసూపర్ స్టార్ కృష్ణ కూతురిగా సినిమాల్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలనుకుంది మంజుల ఘట్టమనేని. అయితే అభిమానులు మా హీరో కూతురు హీరోయిన్‌గా నటించడం తమకు ఇష్టం లేదని గట్టిగా వ్యతిరేకించడంతో ఆ ప్రయత్నాల్ని విరమించుకుంది. నీలకంఠ ప్రయోగాత్మకంగా తెరకెక్కించిన `షో` సినిమాతో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపుని దక్కించుకుంది.
మలయాళ చిత్రం `సమ్మర్ ఇన్ బెత్లేహోమ్`తో ఎంట్రీ ఇచ్చినా మంజులకు నటిగా పేరుని తెచ్చిపెట్టింది మాత్రం `షో`నే. ఆ తరువాత కావ్యాస్ డైరీ.., ఆరెంజ్,. సేవకుడు వంటి చిత్రాల్లో మెరిసింది. నిర్మాతగా షో, పోకిరి, ..ఏమాయ చేసావె వంటి చిత్రాల్ని నిర్మించింది.`మనసుకు నచ్చింది` చిత్రంతో దర్శకురాలిగా మారింది. కానీ సక్సెస్ కాలేకపోయింది. అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేయాలని ప్రయత్నించిన మంజుల కొత్త ప్రయాణం మొదలుపెట్టింది.
`లైఫ్‌లో ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఎత్తు పల్లాలు చూశాను. నా టీచర్స్ అండ్ మాస్టర్స్ నాకు ఎన్నో విషయాలు నేర్పించారు. నా ఈ ప్రయాణంలో నేను నేర్చుకున్న విషయాల్ని ఎంత వరకు మీకు అందించగలను. మీ జీవితాల్లో వెలుగుని చూడగలను అనే ఉద్దేశ్యంతో `మంజుల ఘట్టమనేని` పేరుతో యూట్యూబ్ ఛానల్ ఇదే పేరుతో వెబ్ సైట్ పి కూడా ప్రారంభించేసింది. వీటి ద్వారా తన అనుభవాలని ఆడియన్స్‌తో పంచుకోనుందట.