Begin typing your search above and press return to search.

హార్ట్ నుంచి వచ్చిన కథ

By:  Tupaki Desk   |   13 Dec 2017 12:30 PM GMT
హార్ట్ నుంచి వచ్చిన కథ
X
సినిమా ఇండస్ట్రీలో లేడి టెక్నీషియన్స్ ఉండడం చాలా తక్కువ. ఒక్క కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ లో మాత్రమే ఎక్కువగా కనిపిస్తారు. టాలీవుడ్ లో లేడి డైరెక్టర్స్ ని చూసి చాలా కాలమే అవుతోంది. అయితే మళ్లీ చాలా రోజుల తర్వాత ఒక ఉమెన్ సినిమాను డైరెక్ట్ చేసి అంచనాలను రేపుతున్నారు. సూపర్ స్టార్ మహేష్ సోదరి మంజుల ఘట్టమనేని మనసుకు నచ్చింది అనే సినిమాను డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. సందీప్ కిషన్ - అమైరా దస్తూర్ జంటగా నటిస్తున్న ఆ సినిమా టీజర్ నిన్ననే రిలీజ్ అయ్యి మంచి టాక్ ను సొంత చేసుకుంది.

అయితే ఈ విషయంపై మంజుల స్పందించారు. ఆమె మాట్లాడుతూ.. సినిమా కథ నా హార్ట్ నుంచి వచ్చింది. నాకు చాలా బాగా నచ్చింది. సెట్స్ పైకి కథ వెళ్లాకా కొన్ని సీన్స్ ఇంకా ధైర్యాన్ని ఇచ్చాయి. టీజర్ చూసిన తర్వాత అందరు పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు. సినిమా కూడా తప్పకుండా అందరికి నచ్చుతుందని చెప్పగలను. క్షమించండి.. కొంచెం ఓవర్ గా చెబుతున్న కూడా సినిమా మీద నమ్మకం నాకు చాలా పెరిగింది. తప్పకుండా మంచి హిట్ అవుతుంది. ఇక నటీనటులు కూడా ప్రతి పాత్రకు కరెక్ట్ గా సెట్ అయ్యారు.

సందీప్ కిషన్ లాంటి యాక్టర్ నా సినిమాలో లీడ్ యాక్టర్ గా ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. అతడి గురించి మంజుల చెబుతూ.. ‘‘నా హీరో పాత్రకు సందీప్ నూటికి నూరు శాతం సరిపోయాడు. దర్శకురాలిగా ఇది నా తొలి సినిమా కావడంతో నేను కొంచెం నెర్వస్ ఫీలయ్యాను. ఐతే సందీప్ మాత్రం తొలి రోజు షూటింగుకి వచ్చి చాలా సింపుల్ గా చేసుకెళ్లిపోయాడు. అతణ్ని చూస్తే నా తమ్ముడు మహేష్ బాబే గుర్తొచ్చాడు. అమైరా కూడా తన నటనతో ఆకట్టుకుంటుంది. నిర్మాత కిరణ్ కూడా నా కథని చాలా నమ్మారు. నాకు ఆయన చాలా సపోర్ట్ చేశారు. ఇక నా డైరెక్షన్ విషయానికి వస్తే.. సినిమా న్యాచురల్ గా ప్రతి ఒక్కరికి నచ్చేట్టు తీస్తున్నా. ఇక నెక్స్ట్ సినిమాలు కూడా నా స్టైల్ లో తీస్తాను. ఒక మంచి దర్శకురాలిగా నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని అనుకుంటున్నా అని మంజుల వివరించారు. ఈ సినిమా 2018 జనవరి 26న రిలీజ్ కానుంది.