Begin typing your search above and press return to search.
ఇలా ఎలా మనసుకు నచ్చింది మంజులా?
By: Tupaki Desk | 9 Feb 2018 4:30 AM GMTసూపర్ స్టార్ కృష్ణ కూతురిగా.. ప్రిన్స్ మహేష్ బాబు అక్కగానే కాదు.. మంచి నటిగా.. సూపర్ హిట్ సినిమాల ప్రొడ్యూసర్ గా కూడా మంజుల ఇండస్ట్రీకి సుపరిచితురాలు. ప్రస్తుతం సినిమాల ప్రొడక్షన్ కాస్త విరామమిచ్చి తనలోని ఇంకో టాలెంట్ ను బయటకు తీసింది. తెలుగులో తక్కువగా ఉన్న లేడీ డైరెక్టర్ల కొరత తీరుస్తూ మెగా ఫోన్ పట్టుకుని సినిమా డైరెక్ట్ చేసింది.
యంగ్ హీరో సందీప్ కిషన్ తో ‘మనసుకు నచ్చింది’ సినిమాను తెరకెక్కించింది మంజుల. ఈ సినిమాకు సంబంధించిన ఆడియో లాంచ్ రీసెంట్ గా చేసింది. ఈ ఈవెంట్ ను మంజుల చాలా సింపుల్ గా పూర్తి చేసేసింది. చిన్నపాటి కిట్టీ పార్టీ స్థాయి హడావుడి కూడా లేకుండా ఈ ప్రోగ్రాం చేయడం కృష్ణ అండ్ మహేష్ అభిమానులను ఆశ్చర్య పరిచింది. వీలైనంత గ్రాండ్ గా ఫంక్షన్ చేయడంతోపాటు ఇద్దరు ముగ్గురు గెస్టులను పిలవడం ద్వారా ఎక్కువమంది దృష్టిని ఆకర్ష్షించే అవకాశముంది.
మిగతా వాళ్ల సంగతి అటుంచినా మంజుల పిలిస్తే మహేష్ రాకుండా ఉండడు. ఒకవేళ తను బిజీగా ఉన్నా ఫ్యామిలీలో ప్రతి సినిమా ఈవెంట్ కు తప్పకుండా హాజరై నాలుగు మంచి మాటలు చెప్పే కృష్ణ కూడా రాకుండానే ఆడియో రిలీజ్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈవెంట్ కు హాజరైన గెస్టుల సంఖ్య కూడా చాలా తక్కువే. చాలా కుర్చీలు ఖాళీగానే కనిపించాయి. డైరెక్షన్ పై మనసు పడి.. మనసు లగ్నం చేసి కష్టపడి ‘మనసుకు నచ్చింది’సినిమా తీసిన మంజుల మనసు ఇంతలా ఎందుకు మార్చుకుందో?