Begin typing your search above and press return to search.

మహేశ్ మేనకోడలు సినీ ఎంట్రీ

By:  Tupaki Desk   |   10 March 2017 7:54 AM GMT
మహేశ్ మేనకోడలు సినీ ఎంట్రీ
X
సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె మంజుల తనలో గూడు కట్టుకుపోయిన అసంతృప్తిని బయటపెట్టారు. కృష్ణ కుమార్తెగా పుట్టడం వల్ల తాను చాలా కోల్పోయానని ఆమె అంటున్నారు. ముఖ్యంగా హీరోయిన్ కావాలని తాను కలలు కన్నప్పటికీ తన కన్నవారు అందుకు అంగీకరించలేదు.. అభిమానులు కూడా తనను కమర్షియల్ గా రిసీవ్ గా చేసుకోలేరని తండ్రి కృష్ణ అభిప్రాయపడడం.. ఆయనకు కూడా తాను హీరోయిన్ కావడం ఇష్టం లేకపోవడంతో మానుకున్నానని ఆమె తెలిపారు. అయితే.. తాను సినీరంగంలోనే డైరెక్షన్లోకి రావడం వెనుక తండ్రి కృష్ణ - సోదరుడు మహేశ్ బాబుల ప్రోత్సాహం ఉందని ఆమె వెల్లడించారు. తన కుమార్తె త్వరలో వెండితెరపై కనిపిస్తుందని చెప్పారు.

నిన్న ‘మహిళా దినోత్సవం’ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో మంజుల ఆసక్తికర సంగతులు వెల్లడించారు. “నేను హీరోయిన్ గా ఎదగాలని కలలు కన్నాను. ఆ కల నెరవేర్చుకోవడానికి కృష్ణ కూతురుగా పుట్టడం అడ్డుగా మారింది” అని మంజుల చెప్పారు. తాను అనుకుని ఉంటే వచ్చిన అవకాశాలను వినియోగించుకుని ఒక టాప్ హీరోయిన్ గా పేరు తెచుకునేదాన్నని గతాన్ని గుర్తుచేసుకున్నారు. తమ కుటుంబ గౌరవ మర్యాదలకు ఎటువంటి భంగం వాటిల్లకూడదనే హీరోయిన్ ఛాన్స్ వదులుకున్నట్లు పేర్కొన్నారు. ఆ విషయంలో ఎప్పుడూ తాను బాధ పడలేదని మంజుల స్పష్టం చేశారు.

అయితే.. ఇప్పుడు పరిస్థుతులు పూర్తిగా మారిపోయాయని.. పెద్ద కుటుంబాలకు చెందిన అమ్మాయిలు కూడా సినిమా రంగంలోకి వచ్చి ధైర్యంగా హీరోయిన్స్ గా రాణిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. అంతేకాదు.. ఇంకో సంగతి కూడా చెప్పారు. తన దర్శకత్వంలో వచ్చే మూవీలో తన కూతురు జాన్వీ ని పరిచయం చేస్తున్నట్లు తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/