Begin typing your search above and press return to search.
మూవీ రివ్యూ: 'మన్మథుడు-2'
By: Tupaki Desk | 9 Aug 2019 6:29 PM GMTచిత్రం : 'మన్మథుడు-2'
నటీనటులు: అక్కినేని నాగార్జున - రకుల్ ప్రీత్ సింగ్ - లక్ష్మి - రావు రమేష్ - వెన్నెల కిషోర్ - ఝాన్సీ - నిశాంతి తదితరులు
సంగీతం: చైతన్ భరద్వాజ్
ఛాయాగ్రహణం: ఎం.సుకుమార్
కథా సహకారం: సత్యానంద్
మాటలు: కిట్టు విస్సాప్రగడ - రాహుల్ రవీంద్రన్
స్క్రీన్ - ప్లే: రాహుల్ రవీంద్రన్ - సత్యానంద్
నిర్మాత: అక్కినేని నాగార్జున - కిరణ్
దర్శకత్వం: రాహుల్ రవీంద్రన్
రెండేళ్లుగా అక్కినేని నాగార్జున కెరీర్ ఏమంత సాఫీగా సాగట్లేదు. వరుస ఫెయిల్యూర్లతో ఆయన రేసులో బాగా వెనుకబడిపోతున్నాడు. ఈ స్థితిలో ‘చి ల సౌ’తో దర్శకుడిగా పరిచయమైన రాహుల్ రవీంద్రన్ తో కలిసి ఆయన చేసిన సినిమా ‘మన్మథుడు-2’. నాగ్ కెరీర్ లో కల్ట్ మూవీగా నిలిచిన ‘మన్మథుడు’ టైటిల్ వాడుకోవడంతో ఈ సినిమాపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. దీని టీజర్ - ట్రైలర్ కూడా ఆకట్టుకున్నాయి. మంచి అంచనాల మధ్య ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఆ అంచనాల్ని ఏ మేరకు అందుకుందో చూద్దాం పదండి.
కథ:
శ్యామ్ అనబడే సాంబశివరావు (అక్కినేని నాగార్జున) పెళ్లి అంటే భయపడే నడి వయసు వ్యక్తి. యుక్త వయసులో ప్రేమలో పడి దెబ్బ తిన్న అతను.. అమ్మాయిలతో దీర్ఘకాలిక బంధాన్ని కోరుకోడు. అమ్మాయిలతో రాసలీలల్లో ఆరితేరిన అతను.. అంతకుమించి వాళ్లతో ఏ సంబంధం పెట్టుకోడు. కానీ శ్యామ్ తల్లి.. అక్కచెల్లెళ్లు మాత్రం అతడికి పెళ్లి చేయాలని విశ్వ ప్రయత్నం చేస్తుంటారు. తల్లి బాధ చూడలేక అవంతిక (రకుల్ ప్రీత్) అనే అమ్మాయిని పెళ్లాడబోతున్నట్లు నాటకం మొదలుపెడతాడు శ్యామ్.కానీ అవంతిక ఈ కుటుంబంలోకి వచ్చాక శ్యామ్ ఊహించని పరిణామాలు జరుగుతాయి. అవేంటి.. అవంతిక సాయంతో శ్యామ్ ఆడాలనుకున్న నాటకం రక్తికట్టిందా లేదా? చివరికి శ్యామ్ పెళ్లి చేసుకున్నడా లేదా అన్నది మిగతా కథ.
కథనం - విశ్లేషణ:
‘మన్మథుడు’కి.. ‘మన్మథుడు-2’కి టైటిల్.. జానర్ ఒకటే అనే విషయాల్లో తప్ప ఇంకే రకమైన సారూప్యత లేదని.. ఈ చిత్రం ముందు వచ్చిన సినిమాకు సీక్వెల్ కాదని నొక్కి వక్కాణించాడు నాగార్జున. ఐతే కథాకథనాల పరంగా ‘మన్మథుడు’ను పోల్చుకోకున్నా.. టైటిల్ వాడుకున్నారు కాబట్టి.. ఆ స్థాయి వినోదాన్ని ‘మన్మథుడు-2’ నుంచి ప్రేక్షకులు ఆశించడం సహజం. దీంతో పాటుగా నాగ్ ఇప్పటికీ మన్మథుడే అనిపించే ఛార్మ్ ను కూడా ఆయన నుంచి కోరుకుంటారనడంలో సందేహం లేదు. ఇంకా సంగీత పరంగా కూడా ‘మన్మథుడు’ స్థాయి ఔట్ పుట్ ఆశిస్తారు. కానీ ఈ విషయాలన్నింట్లో ‘మన్మథుడు-2’ పూర్తిగా నిరాశపరుస్తుంది. ‘మన్మథుడు’కి ఇది దరిదాపుల్లో కూడా నిలవదు. ఇక ‘మన్మథుడు’ను పూర్తిగా మనసుల్లోంచి తీసేసి థియేటర్లోకి పెట్టినా నిరాశ మిగిల్చే స్థాయిలో ‘మన్మథుడు-2’ను చాలా బోరింగ్ గా తయారు చేసి పెట్టాడు రాహుల్ రవీంద్రన్.
ఓ ఫ్రెంచ్ సినిమాకు బాగా కనెక్ట్ అయిపోయి.. దాన్ని ‘మన్మథుడు-2’గా తీర్చిదిద్దినట్లు చెప్పాడు నాగ్. ఆ కథను మన ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు మలిచేందుకు ఎంతగానో కష్టపడ్డట్లు కూడా నాగ్ అండ్ కో చెప్పుకొచ్చింది. కానీ ఎంత కష్టపడ్డా కూడా.. ‘ఇది మన సినిమా’ అనే ఏ కోశాన అనుకునేలా చేయలేకపోయారు. పూర్తిగా పోర్చుగల్ లోనే సాగిపోయే ఈ సినిమాలో నేటివిటీ ఫ్యాక్టర్ పూర్తిగా మిస్సయింది. ఇక్కడ కథ విదేశీ నేపథ్యంలో నడిచింది కాబట్టే దాంతో కనెక్ట్ కాలేం అన్నట్లు కాదు. ‘మన్మథుడు’ కథను.. హీరో పాత్రను ప్రేక్షకులతో కనెక్ట్ చేయడంలోనే రాహుల్ రవీంద్రన్ అండ్ టీం విఫలమైంది. ప్లేబాయ్ పాత్రలో ఇమిడిపోవడానికి నాగ్ ఎంతగా ప్రయత్నించినా కూడా ఆయన వయసు, లుక్స్ కారణంగా చాలా వరకు కృత్రిమంగానే అనిపించింది. దీంతో మొదట్నుంచే ఆ పాత్రతో అంతగా కనెక్ట్ కాలేం. చాలా వరకు అడల్ట్ డోస్ ఉన్న డైలాగులు - సన్నివేశాలతో కథను నడిపించి.. అందులోకి ఫ్యామిలీ ఎమోషన్స్ ను కూడా సింక్ చేయడానికి ప్రయత్నించాడు రాహుల్. కానీ అవి ఇందులో ఇమడలేదు. చివరికి చూస్తే అడల్ట్ డోస్ బాగా దట్టించి రాసిన కొన్ని డైలాగులు.. వెన్నెల కిషోర్.. రావు రమేష్ ల కామెడీ మినహాయిస్తే ‘మన్మథుడు-2’లో చెప్పుకోదగ్గ విశేషాలే లేకపోయాయి.
అసలు ‘మన్మథుడు-2’ కథను ఓ ఫ్రెంచి సినిమా ఆధారంగా తీర్చిదిద్దుకున్నారు కానీ.. అక్కడి నుంచి కంటెంట్ తీసుకునేంత ప్రత్యేకత ఏమీ ఇందులో కనిపించదు. యుక్త వయసులో ప్రేమలో విఫలమై పెళ్లి పట్ల వ్యతిరేక భావన పెంచుకుని అమ్మాయిలతో సయ్యాటలు మాత్రమే ఆడే హీరో పాత్రలు తెలుగులో ఎన్ని చూడలేదు? ఇక పెళ్లి కోసం ఇంట్లో పోరు తట్టుకోలేక ఓ అమ్మాయిని తీసుకొచ్చి డ్రామా ఆడే కథలు కూడా బోలెడన్ని మనదగ్గర ఉన్నాయి. అంత విశేషంగా, ప్రత్యేకంగా అనిపించే అంశాలేవీ కూడా ‘మన్మథుడు-2’లో కనిపించవు. ఆరంభంలో హీరో పాత్ర పరిచయం.. వెన్నెల కిషోర్ మార్కు కామెడీ.. కొన్ని అడల్ట్ రేటెడ్ జోకులతో ప్రేక్షకుల్లో బాగానే ఉత్సాహం వస్తుంది కానీ.. కథ కొంచెం ముదిరి పాకాన పడ్డాకే శిరోభారం మొదలవుతుంది. హీరోయిన్ రంగప్రవేశంతో ఇంకా ఊపందుకోవాల్సిన కథనం.. ఆశ్చర్యకరంగా నీరసించిపోతుంది. హీరోయిన్ తో హీరో ఒప్పందం.. పెళ్లి డ్రామా.. అన్నీ కూడా కృత్రిమంగా అనిపిస్తాయి. ఏ కొత్తదనం లేని సన్నివేశాలతో ‘మన్మథుడు-2’ మొదలైన అరగంట నుంచే బోర్ కొట్టించడం మొదలుపెడుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ సైతం తేలిపోయింది.
ద్వితీయార్ధంలో అయితే ‘మన్మథుడు-2’ దాదాపుగా నిద్ర పుచ్చేస్తుంది. కథతో.. పాత్రలతో పూర్తిగా డిస్ కనెక్ట్ అయిపోయేలా బోరింగ్ ఎపిసోడ్లతో సినిమా పూర్తిగా గాడి తప్పేస్తుంది. మధ్య మధ్యలో వెన్నెల కిషోర్.. రావు రమేష్ ల పంచులే లేకుంటే పరిస్థితి ఘోరంగా తయారయ్యేదే. వాళ్ల కామెడీ కొంచెం రిలీఫ్ ఇస్తుంది తప్పితే.. సినిమా మీద ఆసక్తిని మాత్రం పెంచదు. చివరికి ఓ మోస్తరుగా అనిపించే ముగింపుతో ‘మన్మథుడు-2’ అయ్యిందంటే అయ్యిందనిపిస్తుంది. సినిమాలో ఒక చోట బ్రహ్మానందం కూడా మెరిశాడు. ‘మన్మథుడు’లో హిలేరియస్ గా అనిపించిన ఎస్కలేటర్ ఎపిసోడ్ కు కొనసాగింపుగా చిన్న కౌంటర్ ఉందీ చిత్రంలో. ఆ సీన్ దగ్గర ఒక్కసారిగా ‘మన్మథుడు’కు సంబంధించిన ఊహల్లోకి వెళ్లిపోతాం. అప్పుడు కానీ అర్థం కాదు.. మనం చూస్తున్నది ‘పేరు గొప్ప..’ సినిమా అని.
నటీనటులు:
‘మన్మథుడు-2’ నాగార్జునను చూస్తే మిశ్రమానుభూతి కలుగుతుంది. కొన్నిచోట్ల ఈ వయసులో నాగ్ ఏం మెయింటైన్ చేస్తున్నాడబ్బా అనిపిస్తుంది. అదే సమయంలో కొన్ని చోట్ల నాగార్జునపై వయసు ప్రభావం పడుతోందన్న భావన కలుగుతుంది. ‘మన్మథుడు’లో మాదిరి నాగ్ తన ఛార్మ్ తో మెస్మరైజ్ చేస్తాడని ఆశిస్తే అభిమానులు నిరాశ చెందుతారు. ఐతే నాగ్ కొన్ని చోట్ల తన చలాకీ.. రొమాంటిక్ నటనతో ఆకట్టుకున్న మాట కూడా వాస్తవమే. కానీ వయసుకు తగ్గ పాత్రే చేసినప్పటికీ ఆయన ప్రేక్షకుల్ని సంతృప్తి పరచడంలో మాత్రం విఫలమయ్యాడు. రకుల్ ప్రీత్ బోల్డ్ లుక్స్.. యాక్టింగ్ తో ఓకే అనిపించింది. గత సినిమాలతో పోలిస్తే రకుల్ భిన్నంగా కనిపించిందీ సినిమాలో. కానీ పాత్ర తేలిపోవడంతో రకుల్ ప్రత్యేకమైన ముద్ర వేయలేకపోయింది. సీనియర్ నటి లక్ష్మి కొన్ని సన్నివేశాల్లో తన అనుభవాన్ని చూపించింది. వెన్నెల కిషోర్.. రావు రమేష్ తమ వంతుగా బాగానే వినోదం పంచారు. ఝాన్సీ.. దేవదర్శిని.. నిశాంతి పాత్రలకు తగ్గట్లుగా నటించారు. మిగతా నటీనటులంతా ఓకే.
సాంకేతికవర్గం:
‘ఆర్ ఎక్స్ 100’ ఫేమ్ చైతన్ భరద్వాజ్ సంగీతం నిరాశ పరుస్తుంది. ఎంత వద్దనుకున్నా ఇక్కడ ‘మన్మథుడు’ ప్రస్తావన తేవాల్సిందే. ఆ ఆల్బంలో అన్నిటికంటే దిగువన నిలిచే పాట స్థాయిలో కూడా ఇందులోని ఒక్క పాటా లేదు. సినిమా అయ్యాక ఒక్క పాటా గుర్తుండదు. మళ్లీ వినాలనిపించదు. పాటలు ఏదో అలా వచ్చి వెళ్లిపోయాయంతే. నేపథ్య సంగీతం పర్వాలేదు. సుకుమార్ ఛాయాగ్రహణం ఆకట్టుకుంది. పోర్చుగల్ నగరాన్ని బాగా చూపించాడు. విజువల్స్ ఆద్యంతం ఆకట్టుకుంటాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కు ఢోకా లేదు. సినిమా రిచ్ గా తెరకెక్కింది. ఐతే సత్యానంద్ సహకారంతో రాహుల్ రవీంద్రన్ వండిన స్క్రిప్టు మాత్రం తేలిపోయింది. ఈ కథలోనే ఒరిజినాలిటీ మిస్సయింది. లీడ్ రోల్ ను మన ప్రేక్షకులకు రుచించేలా తీర్చిదిద్దడంలో రాహుల్ విఫలమయ్యాడు. తన తొలి సినిమా ‘చి ల సౌ’లో మాదిరి ఎక్కడా సహజంగా సన్నివేశాల్ని పండించలేకపోయాడు రాహుల్. బహుశా తనది కాని కథను అతను ఓన్ చేసుకోలేకపోయాడేమో. ఓ పక్క అడల్ట్ కంటెంట్ దట్టించి.. ఇంకో పక్క ఫ్యామిలీ ఎమోషన్స్ మీదా ఫోకస్ పెట్టడంతో సినిమా రెంటికీ చెడ్డట్లు తయారైంది.
చివరగా: మన్మథుడు.. ఈసారి మురిపించలేదు
రేటింగ్-2/5
Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre