Begin typing your search above and press return to search.

హీరోయిన్లందరూ డర్టీ సినిమాలవైపే

By:  Tupaki Desk   |   20 March 2015 9:30 AM GMT
హీరోయిన్లందరూ డర్టీ సినిమాలవైపే
X
ఎరోటిక్‌ అడల్ట్‌ ఎంటర్‌టైనర్‌ .. ఇలా చెబితే ఎవరికీ అర్థం కాదు కానీ.. ఇంకోలా చెబితే అర్థమవుతుంది. సన్నీలియోన్‌ సినిమాలు అంటే ఠకీమని అర్థమైపోతుంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో ట్రెండ్‌ ఇదే. పోర్న్‌ సినిమాకి కాస్త అటూ ఇటూగా ఉండే సినిమాలకు ఉన్న క్రేజు వేరే ఏ సినిమాలకు లేనేలేదు. మహేష్‌భట్‌ క్యాంప్‌ నుంచి వచ్చిన మర్డర్‌ సిరీస్‌లా, హేట్‌ స్టోరీ సిరీస్‌లో కాస్త గరమ గరమగా ఉంటేనే జనాలు సినిమా చూస్తున్నారు.

అందుకే ఇటీవలి కాలంలో ఎరోటిక్‌ అడల్ట్‌ ఎంటర్‌టైనర్‌ అనే పదం పుట్టుకొచ్చింది. ముఖ్యంగా దీనికి ఆదిగురువులాగా సన్నీలియోన్‌ పాపులర్‌ అయ్యింది. అక్కడ ప్రస్తుతం సన్నీ నటించిన 'ఏక్‌ పహేలీ లీలా' సంచలనమే అవుతోంది. ఈ చిత్రంలో పాటలన్నీ రిలీజ్‌కి ముందే యూట్యూబ్‌లోకి వచ్చేసి హల్‌చల్‌ చేస్తున్నాయి. క్లిక్కులతో ఆన్‌లైన్‌ మోతెక్కిపోతోంది. సరిగ్గా ఇదే పంథాలో మరో సినిమాని నిర్మించడానికి బాలీవుడ్‌ నిర్మాతలు సంసిద్ధమవుతున్నారు. అందుకోసం మనారా (బార్బీహండా) అనే హీరోయిన్‌ కలిశారు. మరో మాట మాట్లాడకుండా మనారా ఓకే చెప్పేసింది.

అసలే అవకాశాల్లేవ్‌. పైగా పాపులారిటీ పెరగాలంటే ఎరోటిక్‌లోనే చేయాలి అనుకుందిట. ఈమె స్వయంగా ప్రియాంక చోప్రాకు కజిన్‌ సిస్టర్‌. ఇక అప్పట్లో విద్యాబాలన్‌ డర్టీపిక్చర్‌ చేసినా, ఇటీవలి కాలంలో సన్నీ వాలకం చూసినా వీటికే మునుముందు భవిష్యత్‌ అని భావించి మనారా ఓకే చెప్పేసిందిట. అన్నట్టు మనారా అంటే తెలీదు కానీ ప్రేమా గీమా జాన్తా నయ్‌ కథానాయిక బార్బీ హండా అంటేనే మనకు గుర్తొస్తుంది ఈ అమ్మడు. మనారా ఎరోటిక్‌ అదిరిపోవాలని కోరుకుందాం.