Begin typing your search above and press return to search.

సునీల్ సినిమా కోసం హీరోయిన్‌ కష్టాలు

By:  Tupaki Desk   |   1 Sep 2015 6:55 AM GMT
సునీల్ సినిమా కోసం హీరోయిన్‌ కష్టాలు
X
గతేడాది సింగర్ శ్రీరామచంద్ర హీరోగా వచ్చిన ప్రేమ గీమ జాంతానై మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది బార్బీ హండా. ఇప్పుడీ భామ మన్నార చోప్రాగా పేరు మార్చేసుకుంది లెండి. తర్వాత జిద్ అంటూ బాలీవుడ్ లోనూ ఎంట్రీ ఇచ్చినా ఆశించిన స్థాయి రిజల్ట్ రాలేదు. సౌత్ లో తమిళ ఇండస్ట్రీలోనూ రెండు సినిమాలు చేసినా కాలం కలిసి రాలేదు. ప్రస్తుతం ఈ భామ సునీల్ హీరోగా వస్తున్న భటులు అనే మూవీలో కనిపించబోతోంది.

కమెడియన్ నుంచి హీరోగా మారిన తర్వాత.. తొలిసారి మాస్ టైటిల్ తో సునీల్ చేస్తున్న సినిమా ఇదే. ఇందులో యాక్షన్ సన్నివేశాలకు బాగా ప్రాధాన్యత ఉటుందని తెలుస్తోంది. ఈసారి ఎలాగైనా సక్సెస్ కొట్టాలనే టార్గెట్ పెట్టుకున్న మన్నారా... మూవీ కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటోదంట. ప్రధానంగా హీరోయిన్ కేరక్టర్ కూడా చాలా యాక్షన్ సన్నివేశాల్లో నటించాల్సి ఉండడంతో... ఫైట్స్ రియలిస్టిక్ గా ఉండడం కోసం... ప్రాక్టీసులు చేస్తోంది మన్నారా. ఫిట్ నెస్ లోనూ, ఫిగర్ లోనూ మార్పులు లేకుండా కనిపించేందుకు... ఈ మూవీ కోసం రెండు నెలలకు పైగా బల్క్ డేట్స్ కూడా ఇచ్చిందీమె. ఈ నెల రెండోవారంలో వైజాగ్ లో భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారు.

నెల రోజుల పాటు సాగనున్న ఈ భారీ షెడ్యూల్ తో షూటింగ్ పార్ట్ చాలావరకూ కంప్లీట్ చేయనున్నారు. ఈ కేరక్టర్ విపరీతంగా నచ్చడంతో... ఏకంగా 17కిలోల బరువు తగ్గిపోయిందట సినిమా కోసం. కమిట్ మెంట్ బాగానే ఉంది కానీ... హీరోయిన్ ఫైట్స్ చేస్తుంటే చూడ్డానికి... సునీల్ సినిమాకి జనాలు వెళ్లారంటారా ? అన్నట్లు ఈ పిల్ల ప్రియాంకచోప్రా, పరిణీతి చోప్రాలకు కజిన్ సిస్టర్ కూడా.