Begin typing your search above and press return to search.
మత్తు కళ్లతో చిత్తు చేస్తున్న మనోహరి
By: Tupaki Desk | 4 Feb 2022 2:30 AM GMTనోరా ఫతేహి పరిచయం అవసరం లేదు. ఈ మొరాకో కెనడియన్ బ్యూటీ ఇండియన్ డ్యాన్సింగ్ ఇండస్ట్రీలో నిరంతరం హాట్ టాపిక్. ఆరంభం పొట్ట పోషించుకునేందుకు ఎన్నో ఉద్యోగాలు చేసిన నోరా చివరికి షాపింగ్ కాంప్లెక్స్ లో కూడా ఉద్యోగానికి చేరింది. అలా వచ్చిన డబ్బుతోనే కుటుంబాన్ని పోషించింది. అయితే అనూహ్యంగా తనలోని డ్యాన్సింగ్ ట్యాలెంట్ నోరా స్థాయిని మరో లెవల్ కి తీసుకెళ్లింది.
ఏకంగా ముంబై పరిశ్రమలో అడుగుపెట్టి సత్తా చాటింది. ఇక్కడ సౌత్ నార్త్ అనే విభేధం లేకుండా నోరా ఐటమ్ నంబర్లు యూత్ కి బోలెడంత కిక్కిచ్చాయి. సింగిల్ ఆల్బమ్స్ తోనూ మెరుపులు మెరిపించింది. ఇక ఈ బ్యూటీ బాలీవుడ్ లో `దిల్బర్`..`నాచ్ మేరీ రాణి`..`ఓ సాకి సాకి` ..`గార్మి` వంటి హిట్ ట్రాక్ లతో ఓ ఊపు ఊపేసిన సంగతి తెలిసిందే. ఆ సక్సెస్ కిక్కులో బాలీవుడ్ ఐటం గాళ్స్ జాబితాలో స్థానం సంపాదించింది. ఈ బ్యూటీ చివరి సారిగా గురు రంధవాతో కలిసి `డ్యాన్స్ మేరి రాణీ` మ్యూజిక్ వీడియోలో కనిపిచింది. తెలుగులో `బాహుబలి ది బిగినింగ్` లో మనోహరి ఐటమ్ నంబర్ తో కిక్కిచ్చింది. అంతకు ముందు `టెంపర్` చిత్రంలో స్పెషల్ సాంగ్ లో నటించింది. మరోవైపు సోషల్ మీడియాల్లోనూ నోరాకి అసాధారణ ఫాలోయింగ్ ఏర్పడింది.
తాజాగా నోరా షేర్ చేసిన ఓ ఫోటోగ్రాఫ్ అంతర్జాలంలో వైరల్ గా దూసుకెళుతోంది. ఈ ఫోటోలో మత్తుకళ్లతో నోరా గమ్మత్తయిన ఫోజిచ్చింది. యూత్ కంటికి కునుకు కరువయ్యే ట్రీట్ ఇది. అయినా మనోహరి మత్తులోకి జోగిపోలేదు.. మత్తులోకి దించుతోంది! అంటూ బోయ్స్ కామెంట్లు చేస్తున్నారు. వైట్ అండ్ వైట్ టూపీస్ లో నోరా హొయలు సంథింగ్ హాట్ .. బాటమ్ థై స్లిట్ లుక్ వెరీ స్పెషల్ అంటూ నోరా భంగిమలను పొగిడేస్తున్నారు. బుల్లితెరపై డ్యాన్స్ రియాలిటీ షోల జడ్జిగా బిజీగా ఉన్న ఈ బ్యూటీ పలు క్రేజీ పాన్ ఇండియా చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తోంది.