Begin typing your search above and press return to search.

చెత్తకుప్ప వద్ద నటుడి ప్రచారం అంతలోనే యూటర్న్​? ఇంతకీ ఏమైంది?

By:  Tupaki Desk   |   22 March 2021 1:40 PM GMT
చెత్తకుప్ప వద్ద నటుడి ప్రచారం అంతలోనే యూటర్న్​? ఇంతకీ ఏమైంది?
X
తమిళ రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. రోజుకో ఇంట్రెస్టింగ్​ వార్త ట్రెండింగ్​లో నిలుస్తోంది. తమిళనాడులోని కోయంబత్తూరు పరిధిలోని తొండముత్తూరు నుంచి ప్రముఖ నటుడు మన్సూర్​ అలీఖాన్​ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్​ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అతడు ఓ చెత్త కుప్ప దగ్గర కూర్చొని.. కుక్కను పక్కన పెట్టుకొని వినూత్న రీతిలో ప్రచారం సాగించారు. ఆయనకు స్పందన కూడా బాగానే వచ్చింది. బాటసారులంతా వినూత్నరీతిలో ప్రచారం చేశారు. సోషల్​మీడియాలో కూడా ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్​ అయ్యాయి.

మన్సూర్​ అలీఖాన్​ ప్రచారం కూడా బాగానే సాగింది. మన్సూర్​ ప్రస్తుతం పోటీ నుంచి తప్పుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఓ వర్గం ఓట్లు చీల్చేందుకే మన్సూర్​ అలీఖాన్​ పోటీచేస్తున్నారని.. ఆయనపై దుష్ప్రచారం సాగింది. దీంతో పోటీ నుంచి తప్పుకున్నట్టు వార్తలు వచ్చాయి. తనపై వచ్చిన ఆరోపణలకు మన్సూర్​ అలీఖాన్​ చాలా మనస్తాపం చెందినట్టు సమాచారం. తొండముత్తూరులోని గాంధీ పార్కు ఏరియాలో మన్సూర్​ ఖాన్​ ఎంతో వింత ప్రచారం చేశారు. ఓ చెత్త కుప్ప దగ్గర పెన్ను, పేపర్​ తీసుకొని ప్రచారం చేశారు. ప్రజల సమస్యలు వింటూ గడిపారు. ప్రజలను కూడా నవ్విస్తూ ముందుకు సాగారు. ఆ తర్వాత పెరూర్‌ పట్టేశ్వరర్‌ ఆలయం వద్ద దుకాణాదారులతో ముచ్చటించారు. శుక్ర, శనివారాల్లో ఆయన ముమ్మర ప్రచారం నిర్వహించారు.

అయితే మన్సూర్​పై కొందరు సోషల్​మీడియాలో తీవ్రమైన దుష్ప్రచారం చేశారు. ఆయన ఓ పార్టీ దగ్గర డబ్బులు తీసుకొని పోటీచేస్తున్నారని.. ఓ వర్గం ఓట్లు చీల్చేందుకు మాత్రమే ఎన్నికల బరిలో నిలిచారని ఆరోపణలు వచ్చాయి. దీంతో మన్సూర్​ ఖాన్​ తీవ్ర మనస్థాపం చెంది ఎన్నికల బరి నుంచి వైదొలిగినట్టు సమాచారం. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్​మీడియాలో వైరల్​గా మారింది. ఈ వీడియో క్లిప్​ నిజమే కాదో ఇంకా అధికారికంగా తెలియదు.
కెప్టెన్‌ ప్రభాకరన్‌ సినిమాతో తెలుగుతెరకు పరిచమైన మన్సూర్​ ఖాన్​, విలన్‌గా మెప్పించారు. తెలుగులో ముఠామేస్త్రి, సాంబ, నాయుడమ్మ వంటి చిత్రాల్లో గుర్తుండిపోయే పాత్రలు పోషించారు.