Begin typing your search above and press return to search.

'మ‌ను' సినిమా క‌ష్టాల‌కు 'నిర్వాణ‌' చెక్!

By:  Tupaki Desk   |   6 July 2018 5:46 PM GMT
మ‌ను సినిమా క‌ష్టాల‌కు నిర్వాణ‌ చెక్!
X
రేలంగి - ర‌మ‌ణా రెడ్డి - రాజ‌బాబు - అల్లు రామ‌లింగ‌య్య‌.....ఆ త‌ర్వాత తెలుగులో ఆ స్థాయి క‌మెడియ‌న్ గా పేరు తెచ్చుకున్న న‌టుడు బ్ర‌హ్మానందం. 30 ఈయ‌ర్స్ ఇండ‌స్ట్రీలో బ్ర‌హ్మి కొన్ని వంద‌ల చిత్రాల్లో న‌టించారు. బ్ర‌హ్మి న‌టించిన కొన్ని పాత్ర‌లు వేరెవ‌రూ పోషించ‌లేరంటే అతిశ‌యోక్తి కాదు. అయితే, స్టార్ క‌మెడియ‌న్ గా ఓ వెలుగు వెలిగిన బ్ర‌హ్మానందం మాత్రం...త‌న‌ కొడుకు గౌతమ్ హీరోను చేయ‌డంలో స‌క్సెస్ కాలేక‌పోయారు. అదే ర‌కంగా తండ్రికి త‌గ్గ త‌న‌యుడిగా గౌత‌మ్ కూడా పేరు సంపాదించ‌లేక‌పోయారు. తాజాగా, హీరోగా త‌న అదృష్టాన్ని మ‌రోసారి ప‌రీక్షించుకునేందుకు గౌత‌మ్ రెడీ అయ్యాడు. చాలా గ్యాప్ త‌ర్వాత గౌతమ్ న‌టించిన ‘మను’ అనే సినిమా ...అనేక బాలారిష్టాల‌ను దాటి త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఇప్ప‌టివ‌ర‌కు గౌత‌మ్ న‌టించిన మూడు సినిమాలు ప్రేక్ష‌కుల‌ను పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయాయి. అయితే, గ‌త ఏడాది `మ‌ను ` సినిమాతో మ‌రోసారి త‌న ల‌క్ ను ప‌రీక్షించుకునేందుకు గౌత‌మ్ సిద్ధ‌మ‌య్యాడు. ఫణీంద్ర నరిశెట్టి అనే కొత్త ద‌ర్శ‌కుడు ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. అయితే, ఈ చిత్రానికి నిర్మాత‌లెవ‌రూ లేరు. సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం క‌ల్పించి....క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఈ చిత్రాన్ని నిర్మించాల‌ని ప్లాన్ చేశారు. గ‌త ఏడాది రిలీజైన ఈ చిత్ర టీజర్.. ట్రైలర్ కు మంచి టాక్ కూడా వ‌చ్చింది. ఇక సినిమా విడుద‌లే త‌రువాయి అన్న త‌రుణంలో ఫండ్స్ స‌రిపోక రిలీజ్ ఆగిపోయింది. అయితే, కొద్ది రోజుల క్రితం...ఈ సినిమాను నిర్వాణ సినిమాస్ టేక్ అప్ చేసింది. బ్యాలెన్స్ వ‌ర్క్ పూర్తిచేసి త్వరలోనే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. గౌతమ్ సరసన చాందిని చౌదరి కథానాయికగా నటించిన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను ఎంత వ‌ర‌కు ఆక‌ట్టుకుంటుందో వేచి చూడాలి.