Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: సస్పెన్స్ పెంచుతున్న మను

By:  Tupaki Desk   |   12 Aug 2018 11:59 AM GMT
ట్రైలర్ టాక్: సస్పెన్స్ పెంచుతున్న మను
X
షార్ట్ ఫిలిమ్స్ తో మంచి పాపులరిటీ సంపాదించుకున్న దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి నుంచి వస్తున్నా సస్పెన్స్ థ్రిల్లర్ 'మను'. తక్కువ బడ్జెట్ తో క్రౌడ్ ఫండింగ్ తో తెరకెక్కిన ఈ సినిమాలో రాజా గౌతమ్ - చాందిని చౌదరి లీడ్ రోల్స్ లో నటించారు. ఈరోజే రిలీజ్ అయింది.

దాదాపు మూడు నిముషాల నిడివి గల ఈ టీజర్ మొదట్లోనే చేప ను గురించి చెప్తూ - చేపను పట్టుకునేందుకు ఎర ను వేస్తారని - చేప ఎర ను మాత్రమే చూసి వెనకున్న తీగను పట్టించుకుండా చిక్కుకుంటుందని ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఆ తర్వాత హీరోయిన్ ఇంట్లోకి ఒకరు అద్దెకు రావడం - అక్కడ చిత్రమైన దొంగతనాలు జరుగుతుంటాయి. దాని వెనక ఒక ఇంట్రెస్టింగ్ కారణం ఏదో ఉంది అన్నట్టుగా చూపించారు. ట్రైలర్ లో విజువల్స్ అన్నీ ఒక ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ ను చూపించబోతున్నరనే ఫీల్ కలిగించాయి.

నరేష్ కుమరన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సస్పెన్స్ థ్రిల్లర్ థీమ్ కు కరెక్ట్ గా సెట్ అయింది. సినిమాటోగ్రఫీ - సీన్స్ అన్నీ కూడా పర్పస్ ఫుల్ గా ఉన్నాయి. లవ్ - ఒంటరితనం - కోరిక - వేట - నొప్పి - అబ్సెషన్ - పాషన్ అంటూ ట్రైలర్ ఎండ్ లో సినిమాలో ఉండబోయే ఎలిమెంట్స్ గురించి కూడా హింట్స్ ఇచ్చారు. ట్రైలర్ చూస్తుంటే ఒక ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్ ను చూడబోతున్నమనే అనిపిస్తోంది. మను సెప్టెంబర్ 7 న విడుదల కానుంది. అంతలోపు ఆ సస్పెన్స్ ఎలా ఉందో మీరూ చూడండి.

వీడియో కోసం క్లిక్ చేయండి