Begin typing your search above and press return to search.

హీరోయిన్‌ ప్రేమ పుకార్లు నిజమే!

By:  Tupaki Desk   |   22 Nov 2022 3:30 AM GMT
హీరోయిన్‌ ప్రేమ పుకార్లు నిజమే!
X
మాజీ మిస్ వరల్డ్‌ బాలీవుడ్ నటి మానుషి చిల్లర్‌ ప్రేమలో ఉందనే వార్తలు గత కొన్ని రోజులుగా వస్తున్న విషయం తెల్సిందే. బాలీవుడ్‌ మీడియాతో పాటు ఇండస్ట్రీ వర్గాల వారు కూడా మానుషి చిల్లర్ గురించి ప్రముఖంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ సమయంలో ఆమె ప్రేమ గురించి మరింత స్పష్టత వచ్చింది.

ఈ ముద్దుగుమ్మ వ్యాపారవేత్త నిఖిల్‌ కామత్ ప్రేమలో ఉందట. అతడు గతంలోనే పెళ్లి చేసుకున్నాడు. 2019 లో పెళ్లి చేసుకున్న నిఖిల్‌ కామత్‌ గత ఏడాది తన భార్యకు విడాకులు ఇచ్చాడు. మానుషి చిల్లర్ తో ప్రేమ విడాకులకు ముందు నుండే నా విడాకుల తర్వాత నా అనే విషయమై క్లారిటీ లేదు కానీ ఇద్దరి మధ్య ప్రేమ కొనసాగుతుందని క్లారిటీ వచ్చేసింది.

నిఖిల్‌ మరియు మానుషిలు తరచు విదేశీ పర్యటనలు.. హాలీడే ట్రిప్స్ వేయడం తో ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం చాలా దూరం వెళ్లిందని.. అతి త్వరలోనే పెళ్లి చేసుకుంటారనే వార్తలు కూడా వస్తున్నాయి. పెళ్లికి సంబంధించిన ఎలాంటి క్లారిటీ ఇప్పటి వరకు బాలీవుడ్ నుండి అందడం లేదు.

మానుషి చిల్లర్ మరియు నిఖిల్‌ కామత్ ల ప్రేమ విషయం ఇరు కుటుంబ సభ్యులకు తెలుసు.. అంతే కాకుండా వారిద్దరి ప్రేమ కు మరియు పెళ్లికి ఇరు కుటుంబాల నుండి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్‌ లభించిందని కూడా సమాచారం అందుతోంది.

బాలీవుడ్‌ తో పాటు దేశ వ్యాప్తంగా మిస్ వరల్డ్‌ గా గుర్తింపు దక్కించుకున్న మానుషి చిల్లర్‌ ప్రేమను దక్కించుకున్న నిఖిల్‌ అదృష్టవంతుడు అంటూ ఆయన సన్నిహితులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. అంతే కాకుండా వందల కోట్ల ఆస్తిపరుడు అయిన నిఖిల్‌ కామత్ తో ప్రేమ పెళ్లి మానుషి అదృష్టం అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.