Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: జీరో సైజ్‌ కి మించి!

By:  Tupaki Desk   |   27 Nov 2018 5:46 AM GMT
ఫోటో స్టోరీ: జీరో సైజ్‌ కి మించి!
X
తిండి లేక స‌న్న‌బ‌డిందా? జీరో సైజ్ కంటే త‌క్కువ సైజ్ ఇంకేదైనా ఉందా! అంటూ సెటైర్లు అక్క‌ర్లేదు. ఇంత ఇదిగా సైజ్ జీరోని మించి త‌పించ‌డం వెన‌క చాలా పెద్ద ప్లాన్ ఉంది. అదే బాలీవుడ్‌ లో ఒకే ఒక్క ఛాన్స్‌!!.. పాపం హ‌ర్యానా బ్యూటీ మానుషి చిల్ల‌ర్ ప‌రిస్థితి ఇదీ. ప్ర‌పంచ సుంద‌రిగా కిరీటం ద‌క్కించుకున్న‌ది మొద‌లు ఇప్ప‌టివ‌ర‌కూ త‌ను చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు. అయినా ఎందుక‌నో ఎవ‌రూ అవ‌కాశం ఇవ్వ‌డం లేదు. విశ్వ‌సుంద‌రి కిరీటం ద‌క్కించుకుని ఇప్ప‌టికే ఏడాది పైగా అయినా ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు.

బాలీవుడ్‌ లో అమీర్ ఖాన్‌ - షారూక్ ఖాన్ అంటే త‌న‌కు ఎంతో ఇష్ట‌మ‌ని ప‌దే ప‌దే వేదిక‌ల‌పైనే చెబుతుంది ఈ అమ్మ‌డు. ర‌ణ‌వీర్ సింగ్ పేరును ప్ర‌స్థావించింది. కానీ వీళ్లెవ‌రూ పిలిచి అవ‌కాశం ఇవ్వ‌లేదు. స‌రిక‌దా.. అస‌లు విశ్వ‌సుంద‌రి ఒక‌రు మ‌న‌కు ఉన్నారు అన్న సంగ‌తినే అంద‌రూ మ‌ర్చిపోయే ప‌రిస్థితి. గ‌త విశ్వ‌సుంద‌రుల‌తో పోలిస్తే మానుషి చాలా పూర్ అని ప్రూవ్ అయిపోయింది.

త‌న‌లానే ఐశ్వ‌ర్యారాయ్ - సుశ్మితాసేన్ - ప్రియాంక చోప్రా అందాల పోటీల నుంచి వ‌చ్చి విశ్వ‌సుంద‌రీమ‌ణులు అని నిరూపించుకున్న త‌ర్వాత క‌నీసం ఏడాది అయినా తిరక్కుండా సినిమాల్లో అవ‌కాశాలు అందుకున్నారు. ఐసూని అయితే మ‌ణిర‌త్నం అంత‌టి దిగ్గ‌జం వెండితెర‌కు ప‌రిచ‌యం చేశారు. సుష్ - పీసీ చెప్పుకోద‌గ్గ సినిమాల్లో న‌టించారు. కానీ మానుషి ఎంత‌గా ఎదురు చూసినా ఆ ఒక్క ఛాన్స్ ప్లీజ్! అన్న ద‌శ‌లోనే ఉండిపోయింది. ప్ర‌స్తుతం చైనా టూర్‌ లో ఉన్న మానుషి అక్క‌డ‌ వేడెక్కించే ఫోటోషూట్ల‌తో చెల‌రేగిపోతోంది. ఈ ఫోటోల్ని సామాజిక మాధ్య‌మాల్లో అభిమానుల‌కు షేర్ చేసింది. జీరో సైజ్‌ కి బ్రాండ్ అంబాసిడ‌ర్ అయిన క‌రీనాని మించి క‌స‌ర‌త్తులు చేస్తోంద‌ని ఈ ఫోటోలు చెబుతున్నాయి. ఎంబీబీఎస్ ఫైన‌ల్ ఇయ‌ర్ చ‌దువును పూర్తి చేసి ఇక పూర్తిగా వార్‌ లోకి దిగిపోతుందేమో చూడాలి.