Begin typing your search above and press return to search.
మాజీ మిస్ వరల్డ్ మొదటి సినిమా రిలీజయ్యేదెపుడు?
By: Tupaki Desk | 10 Sep 2021 3:30 AM GMTమాజీ మిస్ ఇండియా.. 2017 మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ బాలీవుడ్ లో బిగ్ కెరీర్ ని ఆశిస్తున్న సంగతి తెలిసిందే. ఐశ్వర్యారాయ్.. సుశ్మితాసేన్ తరహాలో స్టార్ డమ్ కావాలని కోరుకున్నా ఎందుకనో మానుషిని దురదృష్టం వెంటాడుతోంది. అందాల కిరీటం గెలుచుకుని చాలా సంవత్సరాలు అయినా కానీ తనకు బాలీవుడ్ లో సరైన బ్రేక్ దక్కించుకునే అవకాశం లేదు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు సంతకాలు చేసినా అవేవీ రిలీజ్ కి వచ్చేందుకు ఆస్కారం లేకుండా పోయింది. కరోనా మహమ్మారీ రంగ ప్రవేశం ఈ డెబ్యూ బ్యూటీ పాలిట శాపమే అయ్యిందంటే అతిశయోక్తి కాదు.
అయినా ఏమాత్రం నిరాశ చెందక మానుషి ప్రస్తుతం తన ప్రయత్నాల్లో తాను ఉంది. ఇటీవల సోషల్ మీడియాల్లో ఈ బ్యూటీ వరుస ఫోటోషూట్లను షేర్ చేస్తూ వేడెక్కిస్తోంది. తాజాగా ఫ్లవరిష్ డిజైనర్ లుక్ ని షేర్ చేయగా వైరల్ గా మారింది. మానుషి ఈ లుక్ లో మంత్రముగ్ధులను చేస్తోంది. ఈ లుక్ చూస్తుంటే ఒక అందమైన వాల్ పేపర్ ను గుర్తు చేస్తోంది. మానుషి అద్భుతమైన స్ట్రాపీ క్రాప్ బ్లౌజ్ -లాంగ్ ట్రైలింగ్ స్కర్ట్ ధరించింది. మ్యాచింగ్ గా విచిత్రమైన హెయిర్ బ్యాండ్ అదే ప్రింట్ స్టాకింగ్ లు భారీగా బ్యాంగిల్స్ తో కనిపిస్తోంది. ఆ కాళ్లకు గోధుమ రంగు మడమలను ధరించింది. తల నుండి కాలి వరకూ పూల ప్రింట్లతో నింపేసిన తీరు ఆసక్తిని కలిగించింది. ప్రతిదీ బ్యాలెన్స్ చేస్తూ అద్భుతమైన మేకప్ ని వేసుకుంది. ఫోటోషూట్ బ్యాక్డ్రాప్ లో పూల వాల్ పేపర్ లను కలిగి ఉంది. ఇది నిజంగానే మానుషికి డ్రీమ్ ఫోటోషూట్.
దేనికైనా టైమ్ కలిసి రావాలి...!
మానుషి చిల్లర్.. పరిచయం అవసరం లేదు. 2017 లో ప్రపంచసుందరిగా కిరీటం గెలుచుకుంది మానుషి చిల్లర్. అప్పటి నుంచి ఈ బ్యూటీ బాలీవుడ్ ఎంట్రీ గురించి కలలుగంటోంది. మిస్టర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్.. కింగ్ ఖాన్ షారూక్.. సల్మాన్.. రణవీర్ లాంటి హీరోల సరసన నటించాలనుందని బహిరంగంగానే ప్రకటించిన మానుషికి అప్పట్లో యశ్ రాజ్ ఫిలింస్ లాంటి ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థలో తెరకెక్కనున్న భారీ హిస్టారికల్ చిత్రంలో అవకాశం దక్కించుకుంది.
భారతదేశ రారాజు పృథ్వీరాజ్ చౌహన్ బయోపిక్ లో ఊహించని విధంగా మానుషికి ఈ ఛాన్స్ దక్కింది. కిలాడీ అక్షయ్ కుమార్ ఈ చిత్రంలో టైటిల్ పాత్రను పోషిస్తున్నారు. రాణి సంయుక్త పాత్రలో మానుషి నటిస్తోంది. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ ఈ సినిమాకి ఎగ్జయిటింగ్ పాయింట్. పింజర్.. మొహళ్ల అస్సీ లాంటి భారీ చిత్రాల్ని తెరకెక్కించిన చంద్రప్రకాష్ ద్వివేది ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
దురదృష్టమో ఏమో కానీ మానుషి కి ఆఫర్ దక్కినా ఈలోగానే మహమ్మారీ వల్ల షూటింగ్ వాయిదా పడింది. గ్యాప్ ల తర్వాత షూటింగ్ జరుగుతోందని తెలుస్తోంది. ఐదేళ్ల క్రితం మిస్ వరల్డ్ కిరీటం గెలిచిన అదే రోజున పృథ్వీరాజ్ కోసం నా మొదటి షాట్ చిత్రీకరించారు. నా జీవితంలో రెండు అతిపెద్ద మైలురాళ్ళు ఒకే రోజున సాధ్యమైంది.. అని మానుషి ఆనందంగా చెప్పుకున్నా కానీ ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు.
తన లైఫ్ లో విలువైన ఐదేళ్ల కాలం కరిగిపోయింది. దురదృష్టం వెంటాడింది. పృథ్వీరాజ్ చిత్రం ఇంకా రిలీజ్ కాలేదు. రెండు వేవ్ లతో రెండేళ్లు కాలగర్భంలో కలిసిపోయింది. ఐదేళ్లుగా తపిస్తున్నా తనకు ఆ అరుదైన క్షణం రానే లేదు. పృధ్వీరాజ్ లో నటిస్తున్న అక్షయ్ బ్యాక్ టు బ్యాక్ అరడజను ప్రాజెక్టులకు కమిటైతే.. తన తొలి చిత్రమే ఇంకా రిలీజ్ కి రాలేదు. ఎప్పటికొస్తుందో కూడా క్లారిటీ లేదు. అందుకే ఐదేళ్లు ఈ బ్యూటీకి కాలహరణం అయ్యింది. పృథ్వీరాజ్ చిత్రం 5 నవంబర్ 2021న రిలీజ్ కానుంది. అయితే అప్పటికి పరిస్థితులు అదుపులో ఉండాలి. అది మానుషి అదృష్టంపై ఆధారపడి ఉంది.