Begin typing your search above and press return to search.

ప్రతి దాన్లో బొక్కలు వెతికే బ్యాచ్ మామూలుగా ఉండరు బాస్

By:  Tupaki Desk   |   28 Feb 2022 4:49 AM GMT
ప్రతి దాన్లో  బొక్కలు వెతికే బ్యాచ్ మామూలుగా ఉండరు బాస్
X
రోజులు మారాయి. మనుషుల తీరు మాత్రమే కాదు.. మాట తీరు కూడా మారుతోంది. అది అన్ని రంగాల్లోనూ కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. రంగం ఏదైనా ఒక గీత దాటేందుకు అస్సలు ఇష్టపడే వారు. రాజకీయాల్లోనూ ఇలాంటి తీరే కనిపించేది. కానీ.. ఇప్పుడు అలాంటివన్నీ తెలుగు నేల మీద పోయిన పరిస్థితి. తమకు ఇష్టం ఉంటే ఆకాశానికి ఎత్తేయటం.. నచ్చకుంటే పాతాళానికి తొక్కేయటం ఇప్పుడో అలవాటుగా మారింది. ఇలాంటి వారి తీరు ఎంత ఎక్స్ ట్రీమ్ కు వెళ్లిపోయారంటే.. పాలను పాలుగా.. నీళ్లను నీళ్లుగా ఒప్పుకోవటానికి సైతం వారి ఈగో ఒప్పుకోని పరిస్థితికి వెళ్లిపోయారు.

కోతికి కొబ్బరి చిప్ప దొరికిన చందంగా.. ఇలాంటి వారికి సోషల్ మీడియా ఒక ఆయుధంగా మార్చుకొని..తమ మనసులోని విషాన్ని.. మాటల్లోని దరిద్రాన్ని పంచుకోవటం.. తమలాంటి వారిని పోగేసుకొని శునకానందాన్ని ప్రదర్శించటం ఈ మధ్యన ఎక్కువ అవుతోంది. ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అన్న ధ్యాస లేకుండా.. బరి తెగించేస్తున్న తీరు చూస్తే.. రానున్న రోజుల్లో ఇలాంటి పరిస్థితులు మరెంత వరకు వెళ్లిపోతాయా? అన్న సందేహం కలుగక మానదు.

ఇదంతా ఎందుకంటే.. తాజాగా ‘భీమ్లా నాయక్’ మూవీలో బొక్కలు వెతికే బ్యాచ్ ఒకటి దిగింది. మలయాళం ఒరిజనల్ ను భీమ్లానాయక్ తో పోలుస్తూ.. నోటికి వచ్చినట్లుగా మాట్లాడేయటం.. అభిప్రాయాల పేరుతో తీర్పులు ఇచ్చేయటం ఈ మధ్యన ఎక్కువైంది. ఒక సినిమాను రీమేక్ చేస్తున్నప్పుడు..మక్కీకి మక్కీ దించటం ఒక ఎత్తు.. తమకు అనుకూలంగా కొన్ని మార్పులు చేసుకోవటం ఇంకో పద్దతి.

భీమ్లా నాయక్ విషయంలోనూ అలానే జరిగింది. నిజానికి ఒరిజినల్ చూసినప్పుడు.. ‘కోషియన్’ తప్పు కనిపించదు. ఆ మాటకు వస్తే.. అతడి వాదన సరైనదే కదా? అనిపించకమానదు. మందు తాగి తన దారిన తాను కారులో నిద్ర పోతుంటే.. పోలీసు అన్న పొగరుతో డోర్ తీసి.. కిందపడేసే సీన్ సంగతే చూసుకుంటే..ఒరిజినల్ లో పవన్ పాత్ర అక్కడే ఉంటుంది. కానీ.. భీమ్లా నాయక్ లో మాత్రం బయట ఉంటాడు.. రానా పాత్రధారి రెచ్చిపోతుంటే.. అతడ్ని కంట్రోల్ చేయలేక పవన్ పాత్రను ఫోన్ చేసి పిలవటం కనిపిస్తుంది.

ఒరిజనల్ ను యథాతధంగా భీమ్లానాయక్ మూవీకి వాడేస్తే.. పవన్ పాత్రపై నెగిటివ్ షేడ్ పడుతుంది. ఎందుకంటే.. ఒక పోలీసు తన డ్యూటీకి భిన్నంగా అత్యుత్సాహాన్ని ప్రదర్శించినప్పుడు.. అది కూడా పవన్ పాత్రధారి సమక్షంలో జరగటం అంత సబబుగా అనిపించదు. ఇలా చెప్పుకుంటూ పోతే.. పలు సీన్లు పవన్ ఇమేజ్ ను.. హీరోయిజాన్ని ఎలివేట్ చేసే సీన్లను పెట్టారు. అలాంటప్పుడు భీమ్లాను ఒరిజినల్ తో పోల్చటం తప్పే అవుతుంది.

మలయాళంలో పవన్ పాత్రధారి భార్యగా వేసిన క్యారెక్టర్ ను అలానే.. పవన్ కు భార్యగా వేస్తే ఎలా ఉంటుంది? ఒక అగ్రహీరోతో రీమేక్ చేసేటప్పుడు ప్రాంతానికి అనుగుణంగా.. సదరు హీరో ఇమేజ్ కు నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవటం సహజం. అలాంటి వాటిని పరిగణలోకి తీసుకొని మాట్లాడటం తప్పే అవుతుంది.మలయాళం సినిమాల్లో రస్టిక్ గా తీయటాన్ని అక్కడి ప్రేక్షకులు ఓకే చేస్తారు. కానీ.. తెలుగు ప్రేక్షకులు అన్ని సందర్భాల్లో ఆదరించే అవకాశం తక్కువగా ఉంటుంది.

ఒక తెలుగోడిగా.. తెలుగు ప్రేక్షకుల మైండ్ సెట్ ఎలా ఉంటుందన్న విషయాన్ని పట్టించుకోకుండా.. నోటికొచ్చినట్లు మాట్లాడటం సరైనది కాదు. నిజానికి మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అయి.. ఓటీటీలో పెద్ద ఎత్తున సినిమాను చూసినప్పటికి.. భీమ్లా నాయక్ ఓపెనింగ్స్ ఇంత భారీగా ఉండటం కేవలం పవన్ ఫ్యాన్స్ అనే బేస్ మాత్రమే. పవన్ ను తిడతా రాయటం.. లేని బొక్కల్ని వెతికి మరీ వేధించటం ఈ మధ్యన ఎక్కువైంది.

ఎందుకంటే.. ఇలా బొక్కలు వెతికే వారికి క్రేజ్ రావాలన్నా.. తమను తాము పాపులర్ చేసుకోవాలన్నా పవన్ మాత్రమే దిక్కు. అందుకే.. లేని వాటిని ఉన్నట్లుగా రాసేసి.. ఏదో పిచ్చ వాదనను వినిపించటం ద్వారా పాపులార్టీని తెచ్చుకోవాలన్న తపన ఈ మధ్యన ఎక్కువైంది. ఇలాంటి వారిని వదిలేయటం మంచిదన్న మాట వినిపిస్తోంది. కానీ.. అలా వదిలేస్తే.. లేని పోని రచ్చ చేయటం ఈ మధ్యన ఎక్కువ అవుతోంది. అలాంటప్పుడు ఒక కన్నేసి ఉండటం మంచిదేనని చెప్పక తప్పదు.