Begin typing your search above and press return to search.
తలైవి కోసం ఎదురు చూస్తున్నారా.. అయితే ఇది మీకోసమే!
By: Tupaki Desk | 17 Sep 2021 8:30 AM GMTకంగన రనౌత్ హీరోయిన్ గా రూపొందిన తలైవి చిత్రం ఇటీవలే వినాయక చవితి సందర్బంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. సినిమాకు అన్ని విధాలుగా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా చిత్రీకరణ మొదలు పెట్టిన సమయం నుండే తమిళ ప్రేక్షకులు అమ్మ ను చూడబోతున్నామని ఎదురు చూశారు. అనుకున్నట్లుగానే.. వారు కోరుకున్నట్లుగానే విజయ్ అమ్మ జీవితంను కంగనా సాయంతో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. అమ్మ అభిమానులు ఏమైతే కోరుకున్నారో.. ఏవిషయాలను తెలియాలనుకున్నారో అన్ని విషయాలు తెలిశాయి. తమిళంతో పాటు అన్ని భాషల ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. చాలా పాజిటివ్ గా రివ్యూలు వచ్చిన నేపథ్యంలో సినిమాకు మంచి వసూళ్లు నమోదు అవుతాయని అంతా ఆశించారు. కాని కరోనా భయం ఇంకా చాలా ప్రాంతాల్లో ఉంది. ముఖ్యంగా ఉత్తర భారతంలో చాలా రాష్ట్రాల్లో ఇంకా థియేటర్లు పూర్తి స్థాయిలో ఓపెన్ కాలేదు. అందుకే తలైవికి ఆశించిన స్థాయిలో వసూళ్లు నమోదు అవ్వలేదు.
సినిమాకు వచ్చిన రివ్యూలు మరియు ప్రేక్షకుల స్పందన నేపథ్యంలో చాలా మంది ప్రేక్షకులు థియేటర్లలో చూడకుండా ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఓటీటీ లో ఎప్పుడెప్పుడు వస్తుందా.. ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ చేద్దామా అన్నట్లుగా ఎదురు చూస్తున్నారు. వారి కోసం గుడ్ న్యూస్ ను మేకర్స్ చెప్పారు. హిందీ వర్షన్ ను స్క్రీనింగ్ చేయడానికి ఎక్కడ కూడా థియేటర్లు దొరకడం లేదు. కనీసం వంద థియేటర్లలో కూడా తలైవి సినిమా ఆడుతున్న దాఖలాలు లేవు. అందుకే హిందీ వర్షన్ ను వెంటనే ఓటీటీ ద్వారా స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో తలైవి హిందీ వర్షన్ ను ఈనెలలోనే 24న స్ట్రీమింగ్ చేయబోతున్నారు. వచ్చే వారంలో స్ట్రీమింగ్ అవ్వబోతున్న తలైవిని అత్యధికులు చూసేందుకు ప్రేక్షకులు సిద్దం అవుతున్నారు.
ఇక తమిళం మరియు తెలుగు వర్షన్ లను కాస్త ఆలస్యంగా స్ట్రీమింగ్ చేస్తారట. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో కూడా థియేటర్లలో సినిమా రన్ అవుతుంది. ఒక మోస్తరుగా వసూళ్లు నమోదు అవుతున్నాయి. హిందీ వర్షన్ తో పోల్చితే తెలుగు వర్షన్ వసూళ్లు బాగున్నాయి. తమిళంలో కూడా మంచి వసూళ్లను తలైవి నమోదు చేస్తుంది. అందుకే తలైవి తెలుగు మరియు తమిళ వర్షన్ లను థియేటర్ల రన్ క్లోజ్ అయిన తర్వాత లేదా తగ్గిన తర్వాత స్ట్రీమింగ్ చేస్తారని అంటున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం అక్టోబర్ 8న నెట్ ఫ్లిక్స్ ద్వారానే తలైవి తెలుగు మరియు తమిళ వర్షన్ లు స్ట్రీమింగ్ అవ్వబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన స్ట్రీమింగ్ తేదీల కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది ఖచ్చితంగా గుడ్ న్యూస్ అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు.