Begin typing your search above and press return to search.
ఏజెంట్ పుకార్లు... అఖిల్ వచ్చేనా? లేదా?
By: Tupaki Desk | 16 May 2022 12:30 PM GMTఅఖిల్ అక్కినేని హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న అఖిల్ సినిమా ను గత ఏడాదిలోనే విడుదల చేయాలని భావించారు. కాని కొన్ని కారణాల వల్ల సినిమా షూటింగ్ ఆలస్యం అవ్వడంతో పాటు ఈ ఏడాది ఆగస్టు కు సినిమాను వాయిదా వేశారు. ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం మరియు మీడియాలో వస్తున్న పుకార్ల వల్ల ఆగస్టు లో అయినా సినిమా వచ్చేనా అనే అనుమానం వ్యక్తం అవుతోంది.
ఏజెంట్ సినిమా ను అలా ఇలా చేయాలనే పట్టుదలతో దర్శకుడు సురేందర్ రెడ్డి కాస్త ఎక్కువ శ్రద్ద పెట్టాడేమో అనిపిస్తుంది. ఆ అతి శ్రద్ద కాస్త సినిమా బడ్జెట్ శృతి మించిందంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఏజెంట్ గురించి రకరకాలుగా ప్రచారాలు జరుగుతున్నాయి. ఆ ప్రచారాలు కాస్త ప్రస్తుతం సినిమా గురించి ఒక విధమైన నెగిటివ్ ఇంప్రెషన్ ను క్రియేట్ చేస్తున్నాయంటున్నారు.
ముఖ్యంగా సినిమా బడ్జెట్ ఎక్కువ అవ్వడంతో నిర్మాతలతో దర్శకుడు సురేందర్ రెడ్డికి విభేదాలు తలెత్తినట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. షూటింగ్ ఇప్పటికే పూర్తి అయినప్పటికి మళ్లీ రీ షూట్ పేరుతో దర్శకుడు సురేందర్ రెడ్డి మళ్లీ ఖర్చు పెట్టిస్తున్నాడు అంటూ విమర్శలు వస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారం సోషల్ మీడియాలో ప్రముఖంగా చర్చించుకునేలా మారింది.
ఏజెండ్ సినిమాలో అఖిల్ లుక్ కు అక్కినేని అభిమానులు ఫిదా అయ్యారు. తప్పకుండా సురేందర్ రెడ్డి ఒక మంచి కమర్షియల్ ఎంటర్ టైనర్ ను ఈ సినిమా తో అక్కినేని ఫ్యాన్స్ కు అందిస్తాడని అంతా ఎదురు చూశారు. కాని పరిస్థితి మొత్తం తలకిందులు అయ్యిందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఏజెంట్ విషయంలో ఇప్పటి వరకు ఉన్న పాజిటివిటీ కాస్త పుకార్ల వల్ల నెగిటివ్ గా మారుతోందట.
ఏజెంట్ సినిమా లో అఖిల్ పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందని.. తెలుగు స్ర్కీన్ పై ఎప్పుడు చూడని విధంగా ఉంటుందని అంటున్నారు. ఏజెంట్ లో మలయాళ మెగా స్టార్ కూడా కీలక పాత్రలో నటించడం వల్ల అంచనాలు భారీగా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అయితే ఖచ్చితంగా మంచి బజ్ తో ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయం. కాని మళ్లీ వాయిదా అంటే మాత్రం ఖచ్చితంగా నెగిటివిటీ మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇంతకు సినిమా ఆగస్టులో విడుదల అయ్యేనా లేదా అనేది దర్శకుడు సురేందర్ రెడ్డి లేదా నిర్మాతలు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.