Begin typing your search above and press return to search.
షాకింగ్: డిసెంబర్ వరకూ థియేటర్లు తెరవరు
By: Tupaki Desk | 21 Oct 2020 4:00 PM GMTఅయ్యవారు ఆజ్ఞాపించినా అమ్మవారు కనికరించరు! అన్నట్టే ఉందీ వ్యవహారం. అన్ లాక్ 5.0 ప్రక్రియలో భాగంగా థియేటర్లు తెరుచుకోవచ్చని కేంద్రం మంచి మాట చెబితే.. దానికి స్థానిక ప్రభుత్వాలు ఓకే అయినా కానీ ఇప్పుడు థియేటర్లు తెరవాలంటే డిసెంబర్ రావాల్సిందేనని చెప్పడం షాక్ కి గురి చేస్తోంది.
ఇప్పటికే ఎగ్జిబిటర్ రంగం చితికిపోయిందని లబోదిబోమంటున్నా ఎవరూ పట్టించుకునే పరిస్థితి అయితే కనిపించడం లేదు. థియేటర్లను తిరిగి తెరవడం సినిమాల ప్రదర్శన గురించి హైదరాబాద్ లో తాజాగా పలువురు అగ్ర నిర్మాతలు పంపిణీదారులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఏం తేల్చారు? అంటే..
ఈ సమావేశం తరువాత వారికి తెరవాలా వద్దా అన్నదానిపై ఎలాంటి స్పష్టత రాలేదు. రాష్ట్రంలోని థియేటర్లను తిరిగి తెరవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చింది కాని తెలంగాణ ప్రభుత్వం ఇంకా అనుమతులు ఇవ్వలేదు. టాలీవుడ్ ప్రముఖులు, .... తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మధ్య కీలకమైన సమావేశం జరగాలని యోచిస్తున్నప్పటికీ హైదరాబాద్ వర్షాలు కొనసాగుతున్నందున ఇది అప్రధానంగా మారింది.
తాజా సమాచారం ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లు నవంబర్ లో తిరిగి తెరవబడవు. తగినంత కంటెంట్ లేదు.. సరికదా ప్రోత్సాహకరమైన పరిస్థితులు లేనందున థియేటర్లను తిరిగి తెరిచే ప్రతిపాదనను చాలా మంది తిరస్కరించారు. చాలా మంది నిర్మాతలు డిసెంబర్ 4 న సినిమాలను ప్రదర్శించడానికి అనువైన తేదీగా సూచించిన తరువాత సమావేశం ముగిసింది.
తెలంగాణలో థియేటర్లు తిరిగి తెరవకపోతే యాభై శాతం ఆక్యుపెన్సీతో ఒకే రాష్ట్రంలో సినిమాలను విడుదల చేయడం సాధ్యం కానందున AP లోని థియేటర్లు కూడా మూసివేస్తారట. తెలంగాణ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిన తరువాత థియేటర్లను తిరిగి తెరవడంపై స్పష్టత వస్తుంది. తుది పిలుపునిచ్చేందుకు నవంబర్ మొదటి వారంలో కొన్ని కీలకమైన సమావేశాలు ప్లాన్ చేశారని తెలుస్తోంది. మొత్తానికి ఏపీ-తెలంగాణలో థియేటర్లు డిసెంబర్ వరకూ మూతపడినట్టేనన్న షాకింగ్ న్యూస్ కన్ఫామ్ చేసేసినట్టే.