Begin typing your search above and press return to search.
అండ్ ద విన్నర్ ఈజ్.. మన్యం పులి
By: Tupaki Desk | 5 Dec 2016 10:30 PM GMTపెద్ద నోట్ల రద్దుతో గత మూడు నాలుగు వారాలుగా థియేటర్ల కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడింది. ఈ నిర్ణయం వెలువడ్డ వెంటనే వచ్చిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ బాగా దెబ్బ తింది. ఐతే నిఖిల్ మూవీ ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ డీమానిటైజేషన్ ప్రభావాన్ని తట్టుకుని మంచి వసూళ్లు సాధించింది. ఆ తర్వాతి వారం వచ్చిన జయమ్ము నిశ్చయమ్మురా.. రెమో పర్వాలేదనిపించాయి. వీటికి ఓ మోస్తరు కలెక్ష్లన్లు వచ్చాయి. ఇక గత వారాంతంలో మూడు సినిమాలు రాగా.. అందులో బాక్సాఫీస్ దగ్గర నిలబడింది ఒక్కటే. అదే.. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన ‘మన్యం పులి’.
లాస్ట్ వీకెండ్లో మంచి అంచనాల మధ్య రిలీజైన విజయ్ ఆంటోనీ సినిమా ‘బేతాళుడు’ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ సినిమా అంచనాల్ని అంచుకోవడంలో విఫలమైంది. తొలి రోజు ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి కానీ.. తర్వాతి సినిమా నిలబడలేదు. ఇక సాయిరాం శంకర్ సినిమా ‘అరకు రోడ్లో’ పరిస్థితి దారుణంగా ఉంది. అసలే ఈ సినిమాకు ఏమాత్రం హైప్ లేకపోగా.. సినిమాకు నెగెటివ్ టాక్ రావడంతో జనాలు దీన్ని పట్టించుకునే కనిపించలేదు. ఐతే ‘మన్యం పులి’ మాత్రం అంచనాల్ని మించిపోయింది. ఈ సినిమా నిర్మాతకు.. బయ్యర్లకు లాభాలు తెచ్చిపెట్టేలా ఉంది.
తెలుగు మార్కెట్ మీద కన్నేసిన మోహన్ లాల్.. తక్కువ ధరకే ఈ సినిమాను తెలుగుకి ఇప్పించాడట. ఆసక్తికర ట్రైలర్.. మంచి ప్రమోషన్.. పెద్దగా పోటీ లేకపోవడం.. అన్నీ కలిసొచ్చి ‘మన్యం పులి’ని బాక్సాఫీస్ విజేతగా నిలబెట్టాయి. ఓ మోస్తరు కలెక్షన్లతోనే ప్రాఫిటబుల్ వెంచర్ అయిందీ సినిమా. కంటెంట్ వీక్ అయినా.. అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు.. చక్కటి సినిమాటోగ్రఫీ.. సంగీతం.. మోహన్ లాల్ నటన సినిమాకు ఆకర్షణగా నిలిచాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/