Begin typing your search above and press return to search.
మన్యంపులి.. డబుల్ ధమాకా
By: Tupaki Desk | 14 Dec 2016 11:30 AM GMTఅప్పుడప్పుడూ కొన్ని డబ్బింగ్ సినిమాలు తెలుగు నాట అనూహ్యమైన వసూళ్లు సాధిస్తుంటాయి. ఈ ఏడాది వేసవిలో ‘బిచ్చగాడు’ సినిమా ఏ స్థాయిలో ప్రభంజనం సృష్టించిందో తెలిసిందే. తాజాగా ‘మన్యం పులి’ కూడా ఎవ్వరూ ఊహించని స్థాయిలో తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు సాధించి ఆశ్చర్యపరిచింది. ఈ చిత్రం పెట్టుబడి మీద రెండు రెట్లు లాభాలు అందించడం విశేషం.
‘సరస్వతి ఫిలిమ్స్’ అధినేత సింధూరపువ్వు కృష్ణారెడ్డి ‘పులి మురుగన్’ డబ్బింగ్ హక్కులకు.. అనువాద కార్యక్రమాలకు కలిపి కోటి రూపాయలు వెచ్చించాడట. ఐతే ఈ చిత్రం రూ.2.5 కోట్ల దాకా వసూళ్లు రాబట్టి ఆశ్చర్యపరిచింది. ఇంకా శాటిలైట్ రైట్స్ కూడా చేతిలో ఉన్నాయి కాబట్టి.. నిర్మాతకు ఈజీగా రూ.2 కోట్ల దాకా లాభం తెచ్చిపెట్టేలా ఉంది ‘మన్యం పులి’. ‘జనతా గ్యారేజ్’ తర్వాత మోహన్ లాల్ కు తెలుగులో వచ్చిన క్రేజ్ ను దృష్టిలో ఉంచుకుని ‘మన్యం పులి’ మీద ధైర్యంగా పెట్టుబడి పెట్టేశాడు కృష్ణారెడ్డి.
ఐతే మోహన్ లాల్ కానీ.. ఈ సినిమాకు సంబంధించిన ఇంకెవరు కానీ ప్రమోషన్లలో ఏమీ పాల్గొనలేదు. కాకపోతే నిర్మాత కొంత వరకు బాగానే పబ్లిసిటీ చేశాడు. దీనికి తోడు పాజిటివ్ రివ్యూలు రావడం.. తెలుగులో చెప్పుకోదగ్గ సినిమాలేమీ లేనపుడు రిలీజవడం కూడా ‘మన్యం పులి’కి కలిసొచ్చాయి. దీంతో సినిమాకు మంచి వసూళ్లు వచ్చాయి. ఈ సినిమా సాధించిన విజయం నేపథ్యంలో ఇకపై మోహన్ లాల్ ప్రతి సినిమా కూడా తెలుగులోకి అనువాదం అయ్యేలా కనిపిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/