Begin typing your search above and press return to search.

తెలుగులోకి వస్తున్న మరాఠీ సైరత్

By:  Tupaki Desk   |   18 Jun 2017 7:40 AM GMT
తెలుగులోకి వస్తున్న మరాఠీ సైరత్
X
మనం ఇప్పుడంతా బాహుబలి2 గురించి తెగ మాట్లాడేసుకుంటున్నాం. ఎందుకంటే.. దేశంలోని పలు సినీ పరిశ్రమల సత్తా ఎలా ఉంటుందో చూపించాడు బాహుబలి. కంటెంట్ కరెక్ట్ గా ఉంటే ఏ స్థాయిలో వసూళ్లు సాధించచ్చో ప్రూవ్ చేసిన మూవీ అది. కానీ గతేడాది మరాఠీలో వచ్చిన 'సైరత్' ఇంతకు మించిన ఘనవిజయాన్నే సాధించింది.

మరాఠీ సినీ పరిశ్రమకు 40 కోట్ల మార్క్ ను మించి చూసిన చరిత్ర లేదు. అలాంటిది తొలి సారిగా 50 కోట్లనే.. 100 కోట్ల రూపాయలను దాటేసి.. 110 కోట్ల కలెక్షన్స్ ను సాధించి కొత్త చరిత్రను లిఖించింది సైరత్. ఇంతకీ ఈ సినిమా బడ్జెట్ 4 కోట్లు మాత్రమే కావడం అసలైన విశేషం. ఇప్పుడీ సినిమాను దక్షిణాది భాషల్లోకి రీమేక్ చేయబోతున్నారు. కన్నడలో ఇప్పటికే మనసు మల్లిగే అంటూ రీమేక్ చేయగా.. ఇప్పుడు తెలుగు.. తమిళ్ వెర్షన్స్ పై కూడా అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. ఈ మూవీకి సౌత్ రీమేక్ రైట్స్ అన్నీ రాక్ లైన్ వెంకటేష్ దగ్గరే ఉండగా.. అయనతో కలిసి జీ స్టూడియోస్ తెలుగు.. తమిళ్ వెర్షన్స్ నిర్మాణం చేయనుంది.

ఇప్పటికే నటీనటులపై కూడా తుది నిర్ణయానికి వచ్చేశారట. అధికారికంగా ప్రకటించకపోయినా కొత్త యాక్టర్స్ తో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇమేజ్ ఉన్నవారికి ఈ స్టోరీ లైన్ సరిపడదని నిర్మాతలు అంటున్నారు. మరోవైపు దర్శకుడి విషయంలో రాక్ లైన్ వెంకటేష్ దగ్గర పలు ఆప్షన్స్ ఉన్నా.. జీ స్టూడియోస్ మాత్రం సైరత్ కు దర్శకత్వం వహించిన నాగరాజ్ మంజులేను తీసుకునేందుకు నిర్ణయించింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/