Begin typing your search above and press return to search.
ఎటర్నల్స్ ట్రైలర్: సరికొత్త విజువల్ మాయా ప్రపంచంలోకి పయనం
By: Tupaki Desk | 13 Oct 2021 5:31 AM GMTమార్వల్ స్టూడియోస్ నుంచి ఒక సినిమా వస్తోంది అంటే దాని ప్రత్యేకత గురించి అభిమానులకు చెప్పాల్సిన పనే లేదు. భారీ తనం నిండిన విజువల్ ట్రీట్ అందుబాటులో ఉంటుంది. గగుర్పొడిచే సాహస విన్యాసాలతో పాత్రల చిత్రీకరణ సాగుతుంది. విశ్వం కోసం మానవాళి కోసం మనిషి మనుగడ కోసం సాగే పోరాటాల కథలతో అద్భుత విజువల్ వండర్స్ ని మార్వల్ సంస్థ అందిస్తోంది.
ఈ దీపావలి కానుకగా నవంబర్ 5న మార్వల్ `ఎటర్నల్స్` విడుదలవుతోంది. తాజాగా ఎటర్నల్స్ ట్రైలర్ ని రిలీజ్ చేసారు. ట్రైలర్ ఆద్యంతం అద్భుత విజువల్ మాయాజాలం భారీతనం నిండిన గ్రాఫిక్స్ కట్టి పడేసాయి. థానోస్.. ఎటర్నల్స్ అంటూ పాత్రల గురించిన ఆసక్తికర చర్చ ఆకట్టుకుంటుంది. దుష్ఠశక్తుల నుంచి మానవాళిని కాపాడేందుకు సాగే పోరాటం లో ఎటర్నల్స్ ప్రయత్నం ఎలా సాగింది? అన్నది తెరపైనే చూడాలి. మార్వల్ సినిమాటిక్ యూనివర్శ్ నుంచి ఎటర్నల్స్ సిరీస్ మూడోది. తెలుగు వెర్షన్ రిలీజవుతోంది కాబట్టి ఇది తెలుగు అభిమానులకు కన్నుల పండుగను తెస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు. చోయే జావో దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని 200 మిలియన్ డాలర్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. అంటే ఇది సుమారు 1400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. దాదాపు మూడు గంటల నిడివి ఉన్న సినిమా ఇదని తెలుస్తోంది.
ఇండియాలో దాదాపు అన్ని భాషల్లోనూ ఎటర్నల్స్ రిలీజవుతోంది. ఈ సందర్భంగా మార్వల్ ఇండియా సంస్థ భారీ ప్రచారానికి తెర లేపింది. హైదరాబాద్ -బెంగళూరు - చెన్నయ్ సహా అన్ని మెట్రో నగరాల్లోనూ ప్రత్యేకంగా థియేటర్లలో ప్రచారకార్యక్రమాల్ని సాగిస్తుందని సమాచారం.