Begin typing your search above and press return to search.

సింగల్ స్క్రీన్లకు మార్చ్ పరీక్ష

By:  Tupaki Desk   |   2 March 2019 6:45 AM GMT
సింగల్ స్క్రీన్లకు మార్చ్ పరీక్ష
X
ఎన్నడూ లేనంత నీరసంగా ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ నత్త నడక నడుస్తోంది. రెండు నెలలు పూర్తయ్యాయి. బ్లాక్ బస్టర్ గా ఎఫ్2 డీసెంట్ హిట్ గా యాత్ర తప్ప ఇంకే సినిమా చెప్పుకోదగ్గ రీతిలో ఆడలేకపోయాయి. వాటిలో అధిక శాతం నష్టాలు మిగిల్చినవే. బాలకృష్ణ నుంచి అఖిల్ దాకా అందరూ చేతులు కాలేలా చేసినవాళ్ళే. నిన్న కళ్యాణ్ రామ్ 118 అజిత్ విశ్వాసంలు వచ్చాయి కానీ మరీ అద్భుతాలు జరిగే రేంజ్ లో వాటి మీద రిపోర్ట్స్ ఏమి లేవు. మొత్తంగా చూస్తే ఈ నెల కూడా చాలా చప్పగా సాగిపోయే అవకాశాలు ఉన్నాయి.

22న వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటున్నారు కానీ ఆలోపే ఎన్నికల ప్రకటన వచ్చేసి ఉంటుంది కాబట్టి ఏదో ఒకరూపంలో బ్రేక్ పడే ఛాన్స్ ఎక్కువగా ఉంది. తెలంగాణ ఈ సమస్య లేకపోయినా ఒక తెలుగు రాష్ట్రంలోనే రిలీజ్ చేస్తే దాని ప్రభావం లేట్ గా రిలీజయ్యే పక్క స్టేట్ మీద చాలా తీవ్రంగా ఉంటుంది. ఇదిలా ఉంచితే నెలాఖరున నిఖిల్ అర్జున్ సురవరం వచ్చే దాకా ఈ నీరసం కొనసాగక తప్పేలా లేదు

ఒకవైపు సింగల్ స్క్రీన్ యజమానులు కనీసం రెంటల్ కు సరిపడా వసూళ్లు లేక ఉసూరుమంటున్నారు. మల్టీ ప్లెక్సుల పరిస్థితి ఇలా ఉండదు. హిందీ ఇంగ్లీష్ సినిమాలతో ఏదోలా నెట్టుకొస్తూ క్యాంటీన్ సేల్స్ ఏపిలో పార్కింగ్ ఫీజ్ ఇలా రకరకాల మార్గాల్లో ఆదాయం ఉంటుంది. పైగా ఒక చోట నష్టం వచ్చినా చైన్ మేనేజ్ మెంట్ కాబట్టి ఇంకో చోట లాభాల్లో సర్దేస్తారు.

కానీ సింగల్ స్క్రీన్ల పరిస్థితి అది కాదు. ఏ నెలకా నెల లెక్కలు సరిచేసుకోవాల్సిందే. బిసి సెంటర్లలో అధిక శాతం ఇవే ఉంటాయి. మనుగడ సాగాలి అంటే ఖచ్చితంగా సగం హాల్ నిండేంత ఫీడింగ్ రోజు రెండు మూడు ఆటలకైనా జరగాలి. అంత సీన్ ఎక్కడా కనిపించడం లేదు. ఇదే కొనసాగితే కొంత కాలం మూసివేసే పరిస్థితి ఉందని కొందరు ఎగ్జిబిటర్లు బాహాటంగానే అంటున్నారు. ఈ కష్టాలు తీరేదెన్నడో