Begin typing your search above and press return to search.
పూరీ మాటలే చెబుతున్న మారుతి..!
By: Tupaki Desk | 31 July 2018 1:30 AM GMTఎప్పుడు కథ రాసుకుంటాడో.. ఎప్పుడు సినిమా తీస్తాడో అన్నది అర్థం కాకుండా మూవీల్ని పూర్తి చేయటంలో పూరీ జగన్నాథ్ తర్వాతే ఎవరైనా. తాను తీసే సినిమాల్లో హీరో ఎవరైనా సరే.. తన స్టైల్లో వెళ్లే పూరీ సినిమాల సక్సెస్ మీడ డిఫెరెంట్ ఓపినీయన్ ఉండొచ్చు కానీ.. స్పీడ్ గా సినిమాలు తీస్తారన్న మాటకు మాత్రం అందరూ ఓటేస్తారు.
ఈ కారణంతోనే చాలా తక్కువ వ్యవధిలోనే నలభై వరకూ సినిమాలు చేశారు పూరీ జగన్నాధ్. అంతేనా.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో ఆయన తీసిన కెమేరా మెన్ గంగతో రాంబాబు మూవీని ఎంత స్పీడ్ గా చేశారో తెలిసిందే.
చాలామంది దర్శకులు కథలు కొరత ఉన్నట్లుగా చెబుతారు. కానీ.. పూరీ మాత్రం అందుకు భిన్నం. కథలకు లోటు లేదని చెబుతుంటారు. తన దగ్గర ఎప్పుడూ పదేళ్లకు సరిపడా స్క్రిప్టులు ఉన్నట్లు చెబుతారు. ఇప్పుడు పూరీ మాదిరే చెబుతున్నాడు టాలీవుడ్ దర్శకుడు మారుతి.
పూరీ మాదిరే చాలా వేగంగా సినిమాలు చేసే అలవాటున్న మారుతి తాజా చిత్రం బ్రాండ్ బాబు. త్వరలో విడుదల అవుతున్న ఈ మూవీ ప్రమోషన్ ను మొదలెట్టేశాడు మారుతి. ఈ సందర్భంగా ఆయనో ఆసక్తికర విషయాన్ని చెప్పారు. తన దగ్గరున్న కథలతో సినిమాలు తీయటం మొదలు పెడితే పదేళ్లకు సరిపోతాయని వ్యాఖ్యానించటం విశేషం.
తన దగ్గరున్న కథల్ని వేరే దర్శకులతో పెట్టి తీయటం మీద మారుతి స్పందిస్తూ.. తన కథల్ని సినమాలుగా తీయాలంటే పదేళ్లు సరిపోతాయని.. అయితే.. కొన్నేళ్ల తర్వాత ట్రెండ్ మారిపోతుందని.. ఒకవేళ తానే డైరెక్ట్ చేయాలంటే తన దగ్గరున్న కథల్ని తాను తీయలేకపోవచ్చన్నాడు.తన కథైన బ్రాండ్ బాబును దర్శకుడు ప్రభాకర్ చాలా బాగా తీశాడని చెప్పారు. సినిమా రిలీజ్ ముందు ఎవరైనా చెప్పేది ఇదే మాట కదా? మరీ సినిమాకు ప్రేక్షకులు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి.