Begin typing your search above and press return to search.

ఒక షెడ్యూల్‌ ముగించినా భయం ఎందుకు మారుతి?

By:  Tupaki Desk   |   31 Oct 2022 7:30 AM GMT
ఒక షెడ్యూల్‌ ముగించినా భయం ఎందుకు మారుతి?
X
కెరీర్‌ ఆరంభంలో బూతు చిత్రాల దర్శకుడిగా మారుతి పేరు దక్కించుకున్నాడు. లక్షల్లో బడ్జెట్‌ పెట్టి కోట్ల రూపాయలు దక్కించుకుని అందరి దృష్టిని ఆకర్షించిన మారుతి తక్కువ సమయంలోనే టాలీవుడ్‌ లో పెద్ద దర్శకుడిగా మారిపోయాడు. యంగ్‌ హీరోలతో పాటు సీనియర్ హీరోలతో కూడా సినిమాలు చేశాడు.

బూతు చిత్రాల దర్శకుడి బ్రాండ్ నుండి భలే భలే మగాడివోయ్.. మహానుభావుడు ఇంకా పలు సినిమాలు చేయడం ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్‌ కు మారుతి కనెక్ట్‌ అయ్యి తన పాత బ్రాండ్ ఇమేజ్ నుండి పూర్తిగా బయట పడ్డాడు. ఇప్పుడు ప్రభాస్ తో మారుతి సినిమా చేస్తున్న విషయం తెల్సిందే.

మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఒక సినిమా రూపొందుతుంది. ఆ విషయం అందరికి తెలుసు. కానీ అధికారికంగా మాత్రం ఇప్పటి వరకు ప్రకటించలేదు. ఇటీవల నాలుగు అయిదు రోజుల పాటు ఒక షెడ్యూల్‌ ను కూడా ముగించారు అంటూ సమాచారం అందుతోంది. ప్రభాస్ ఆ షెడ్యూల్‌ ను ముగించి ప్రస్తుతం సలార్ షూట్‌ లో పాల్గొంటున్నాడు.

తాజాగా దర్శకుడు మారుతి 'లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌ స్క్రైబ్‌' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లో పాల్గొన్నాడు. ఆ సందర్భంగా హీరో సంతోష్‌ తో పాటు వచ్చిన ప్రేక్షకులు కూడా ప్రభాస్ తో మారుతి చేస్తున్న సినిమా గురించిన అప్‌డేట్‌ కావాలంటూ డిమాండ్‌ చేశారు. ఆ సమయంలో కూడా మారుతి స్పందిస్తూ ఫ్యాన్స్ నన్ను కొడతారేమో అన్నట్లుగా వ్యాఖ్యలు చేశాడు.

ప్రభాస్ ఫ్యాన్స్‌ లో కొద్ది మంది మారుతి దర్శకత్వంలో సినిమా వద్దంటూ డిమాండ్‌ చేస్తున్నారు. ఆ మధ్య బాయ్ కాట్ అంటూ కూడా ప్రచారం చేశారు. అయినా కూడా సినిమా అయితే ప్రారంభం అయ్యింది. సినిమా మొదలు అయిన తర్వాత కూడా ఇంకా ఎందుకు ప్రభాస్‌ ఫ్యాన్స్ కి మారుతి భయపడుతున్నాడో అర్థం కావడం లేదు.

సినిమా పూర్తి చేసి కూడా ఇలాగే భయపడుతూ సినిమా ను విడుదల చేస్తారా.. లేదంట అసలు భయంతో సినిమాను విడుదల చేయకుండా.. ప్రమోషన్ చేయకుండా ఉంటారా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రభాస్ తో సినిమా మొదలు పెట్టిన మారుతి ఈ భయంతో ఎలాంటి సినిమాను తీస్తాడో అనే ఆందోళనని కొందరు వ్యక్తం చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.